అన్వేషించండి
Advertisement
Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
Andhra Pradesh News: రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తోన్న ఆర్టీసీ బస్సు కూలీలను ఢీకొట్టింది. రహదారి పక్కన ట్రాక్టర్ పైకి ధాన్యం బస్తాలు ఎక్కిస్తుండగా ఈ ఘోరం జరిగింది.
APSRTC Bus in Konaseema District: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు కూలీలను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రహదారి పక్కన ట్రాక్టర్ పైకి ధాన్యం బస్తాలు ఎక్కిస్తుండగా.. కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితులను చక్కదిద్దారు.
రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మృతుల్లో ముగ్గురు జి.పెద్దపూడి, మరొకరు ఆదిమూలవారిపాలెం నివాసులుగా పోలీసులు గుర్తించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
న్యూస్
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion