AP Crime News: మైనర్ బాలికను పరువు కోసం చంపారా? లేక ఆత్మహత్యా?
Crime News: అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో ఓ మైనర్ బాలిక మృతి అనుమానాస్పదంగా మారింది. సమీప బంధువు యువకుడితో ఇంటినుంచి వెళ్ళిపోగా పోలీసులు తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన రెండో రోజు చనిపోయింది.
Anantapur Crime News: దారుణమైన ఘటన ఒకటి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతి ఎగువ బోయపల్లెలో ఓ పరువు హత్య జరిగింది. అయితే, ఇది ఆత్మహత్యా? లేక పరువు హత్యా? అనే దానిపై స్పష్టత లేదు.
స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోయపల్లెకు చెందిన హరినాథ్ కుమార్తె గుగ్గిళ్ళ శ్వేత (మైనర్ బాలిక) అదే గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ ను ప్రేమించింది. గత నెల బాలిక ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక మైనర్ కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
మృతిపై అనుమానాలు
సమీప బంధువు అయిన యువకుడు కావడంతో పోలీస్ స్టేషన్ లో జరిగిన చర్చలో మైనారిటీ తీరిన తరువాత వివాహం చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ సోమవారం జరిగిన చర్చల అనంతరం బాలికను ఇంటికి తీసుకెళ్లారు. ఏమైందో తెలియదు.. బాలిక ఇంటికి ఎలా వచ్చిందో.. అదే డ్రస్ తో పెద్దమండెం మండలం బండ్రేవు వద్ద తపసిమాను గుట్టలో చెట్టుకు చున్నీతో ఊరేసుకుని వేలాడుతూ కనిపించింది.
ఎవరికి తెలియకుండా దహనం
బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని కొంత దూరం తీసుకెళ్లి గుట్టుగా కాల్చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కొట్టి చంపేసారా.. లేక ఆత్మ హత్య చేసుకుందా.. పరువు కోసం చంపి గుట్టుగా కాల్చేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్చి ఉంది. అయితే ఇది పరువు హత్యగా అయితే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
అనుమానాస్పద మృతిగానే
బాలిక మృతి పట్ల మదనపల్లి డీఎస్పీ కొండయ్య మాట్లాడుతూ బాలిక మృతి చెందిన విషయం పై అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశామని.. విచారణ చేస్తున్నట్లు తెలిపారు. విచారణ లో ఏదైన కారణాలతో హత్య చేసినట్లు రుజువైతే నిందుతుల పై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఈ విషయం పై వస్తున్న ఆరోపణల్లో పెద్ద మనుషులు, పోలీసులు పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు వివరించారు.
గంజాయి సేవిస్తున్న యువకుల అరెస్టు
గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 12 మంది యువకులను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ కొండయ్య తెలిపారు. మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐలు శేఖర్, రమేష్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కోళ్లబైలు సమీపంలో గంజాయి సేవిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు రెవెన్యూ వారితో కలిసి దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ దాడిలో 12 మంది యువకులను అరెస్ట్ చేసినట్టు.. రూ. 46వేల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకునట్లు వివరించారు. నిందితులను రిమాండుకు తరలిస్తునట్లు వెల్లడించారు.
Also Read: కర్నూలు టీడీపీ నేత హత్యపై హోంమంత్రి స్పందన, వాళ్లని వదిలేది లేదని హెచ్చరిక
Also Read: కొలిక్కిరాని దువ్వాడ కుటుంబ పంచాయితీ, శ్రీనివాస్ మంచి నటుడని మాధురి కామెంట్