అన్వేషించండి

Duvvada Srinivas: కొలిక్కిరాని దువ్వాడ కుటుంబ పంచాయితీ, శ్రీనివాస్ మంచి నటుడని మాధురి కామెంట్

Tekkali News: దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయితీ సమసిపోలేదు. ఆయన ఇంటి నుంచి రావడం లేదు. ఇంటి ముందు నిరసన చేస్తున్న భార్య కదలడం లేదు. వివాదానికి కేంద్ర బిందువైన మాధురి రీల్స్ చేస్తూ చిల్ అవుతున్నారు.

Srikakulam News: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. గొడవలను ఆపేందుకు మధ్యవర్తులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవేవీ కొలిక్కి రావడం లేదు. ఇరు వర్గాలను శ్రేయస్సును, పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయన భార్య దువ్వాడ వాణి తన దీక్షను కొనసాగిస్తున్నారు. 

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ వాణి నిరసన దీక్ష ఆరో రోజూ కొనసాగుతోంది. తన కుమార్తెలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చున్న ఆమె... తమను ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి సమీపంలో ఉన్న షెడ్‌లో దీక్ష చేస్తున్నారు. 

విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కావడం పది మంది పది రకాలుగా మాట్లాడుకోవడంతో పోలీసు స్టేషన్లతో ఇరు వర్గాల ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మధ్యవర్తులు రంగంలోకి దిగారు. పరిస్థితిని కూల్ చేసి మధ్యే మార్గంగా సమస్యను పరిష్కరించేందుకు ఇరు వర్గాలతో చర్చలు జరుపుతన్నారు. మూడు రోజుల నుంచి జరుగుతున్న చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. 

ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్‌ ఉంటున్న ఇల్లు తప్ప ఏ ఆస్తులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వైసీపీ ఎమ్మెల్సీ చెబుతున్నారు. ఆ ఇల్లు వాళ్లకు ఇచ్చిన మరుక్షణమే తనను ఇంటి నుంచి బయటకు నెట్టేస్తారని ఆరోపిస్తున్నారు. అందుకే తాను ఆ ఇంటిని ఇవ్వలేనంటూ తేల్చి చెబుతున్నారు. ఇంత రచ్చ చేసిన వాణితో కలిసి ఉండలేనని విడాకులు తీసుకుంటానని చెబుతున్నారు. 

వాణి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తన కుమార్తెల పేరున రాయాలని అంటున్నారు. విడాకులు ఇచ్చేందుకు కూడా ఆమె అంగీకరించడం లేదు. కుమార్తెల బాధ్యత పూర్తిగా ఆయన చూసుకోవాలని చెబుతున్నారు. 

ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరున ఉండడంతో సమస్య పరిష్కారం చాలా జఠిలంగా మారింది. ఇరు వర్గాల్లో ఎవరూ ఒక అడుగు కూడా తగ్గి రాకపోవడంతో సమస్య ఇంకా పరిష్కారం కావడం లేదు. 

మరోవైపు వివాదానికి  కారణమైన మాధురి వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత తన ఇంట్లో రెస్టు తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు రీల్స్ చేస్తున్నారు.  రోజుకో వీడియోతో సంచలనం సృష్టిస్తున్నారు. తాను మోసపోయానంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ పాటలు కూడా పాడారు. ఆమె వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాల్‌లో ఓ పోస్టు పెట్టారు. నువ్వు పక్కనుంటే చాలు కన్నీళ్లన్నీ ఇలా నవ్వులై నన్ను చేరాతాయంటూ పోస్టు పెట్టారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Madhuri Divvala (@madhuri_me_telugu_ammai)

అంతే కాకుండా దువ్వాడ శ్రీనివాస్ మంచి నటుడు అంటూ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో నటించాలనే కోరిక దువ్వాడకు ఉందని అన్నారు మాధురి. ఆ ప్రయత్నాలు కూడా జరిగాయని అయితే ఒకరి దగ్గర పని చేసే ఉద్దేశం లేకనే విరమించుకున్నారని అభిప్రాయపడ్డారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Madhuri Divvala (@madhuri_me_telugu_ammai)

దువ్వాడ టాలెంట్‌ తెలుసుకొనే ఓ సినిమా కూడా తన డబ్బులు పెట్టి తీశానని అన్నారు. కేరళ నుంచి ఓ నటిని తీసుకొచ్చి సినిమా తీశామని వివిరంచారు. ఎన్నికల్లో పడి ఆ సినిమా రిలీజ్ సంగతే పక్కనే పెట్టేశామన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget