RTC Bus Accident: ఏపీలో మరో విషాదం, అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం - బైకులను ఈడ్చుకెళ్లడంతో దారుణం
Anantapur Road Accident: ఏపీలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. అనంతపురంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి.
RTC Bus Accident In Anantapur: అనంతపురం: ఏపీలో మరో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలో సోమవారం ఉదయం బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ చిన్నారి, పెద్దావిడ చనిపోవడం తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి అనంతపురం కలెక్టరేట్ సమీపంలో ఆర్టీసీ బీభత్సం సృష్టించింది. అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది హిందూపురం నుంచి అనంతపురం టౌన్ లోకి వచ్చిన హిందూపురం డిపో బస్సు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. సుమారుగా ఢీకొట్టిన ద్విచక్ర వాహనాలు దాదాపు 300 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకుంటూ వెళ్ళింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. స్థానికులు బస్సు కింద ఉన్న ద్విచక్ర వాహనాలను జరిపి, వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో మహబూబ్ బాషా అనే వ్యక్తి స్పాట్లో చనిపోగా మరో ఇద్దరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు బస్సు ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి వన్ టౌన్ పోలీసులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కి తప్పుందా లేక ద్విచక్ర వాహనాల్లో వచ్చిన వారికి తప్పు ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బస్ నంబర్: ఏపీ02z0499. మహబూబ్ భాష అనే 21 ఏళ్ల యువకుడు చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
కాలేజీ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు
ఏలూరు: ఏలూరు సమీపంలోని చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీకి చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కాలేజీ నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాలేజీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సహాయంతో విద్యార్థులను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే కారణమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ - చిన్నారి సహా ఇద్దరు మృతి
విజయవాడలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై ప్రయాణికులు వేచి ఉండగా వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటన (Vijayawada Bus Accident)లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, ఓ మహిళ, చిన్నారి ఉండగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు చీరాలకు చెందిన కుమారిగా, బుకింగ్ క్లర్క్ ను గుంటూరు - 2 డిపోకు చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్యగా గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్ (18 నెలలు)కు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మహిళ కాలు విరగ్గా, బాలుడు మృతి చెందాడు.