Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Gas Cylinder Explosion: గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Gas Cylinder Explosion In Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. జిల్లాలోని సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తెల్లవారుజామున పెను విషాదం..
పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో జైనుబి కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున దాదాపు 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. భారీ శబ్ధంతో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఇంటిపై కప్పుకూలిపోయింది. దాంతో జైనుబీ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతులు దాదు(35), షర్ఫున(30), ఫిర్దోజ్(6), జైనుబి(60)గా పోలీసులు గుర్తించారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు