Anakapalli: పుట్టినరోజు వేడుకలలో ఊహించని విషాదం, బీచ్ లో యువకుడు గల్లంతు - డెడ్ బాడీ కోసం గాలింపు
Anakapalli youth feared drowned in sea: ఫ్రెండ్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు హాజరైన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో జరిగింది.
![Anakapalli: పుట్టినరోజు వేడుకలలో ఊహించని విషాదం, బీచ్ లో యువకుడు గల్లంతు - డెడ్ బాడీ కోసం గాలింపు Anakapalli Crime a youth feared drowned in sea at Parawada mandal Anakapalli: పుట్టినరోజు వేడుకలలో ఊహించని విషాదం, బీచ్ లో యువకుడు గల్లంతు - డెడ్ బాడీ కోసం గాలింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/15/1484e98ae80b64ac160eed1eda7346ea1689440503129233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anakapalli Crime: పుట్టినరోజు వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రెండ్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు హాజరైన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడంటూ యువకుడి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
అసలేం జరిగిందంటే..
అనకాపల్లికి చెందిన కేదారి శెట్టి గౌతం శివ తన స్నేహితుడు పుట్టినరోజు సందర్భంగా 12 మంది స్నేహితులతో కలిసి పరవాడ మండలం తిక్కవాని పాలెం బీచ్ కి వెళ్లాడు. అనంతరం అక్కడ స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ, సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద కెరటం రావడంతో గౌతమ్ శివ గల్లంతయ్యాడు.
గౌతమ్ శివ అనే యువకుడితో పాటు మరికొందరు స్నేహితులు సైతం కెరటం రావడంతో సముద్రంలో చిక్కుకున్నారు. తోటి విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో వీరి అరుపులు విన్న స్థానికులు అక్కడికి వచ్చి కొంతమందిని రక్షించారు.
కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. గౌతమ్ శివ అనే యువకుడు సముంద్రంలో గల్లంతయ్యాడు. అతడి డెడ్ బాడీ కోసం పోలీసులు కోస్ట్ గార్థుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గౌతమ్ శివ అనకాపల్లి ఏ ఎం ఏ ఎల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడి వయసు 16 సంవత్సరాలు ఉంటుందని పోలిసులు తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)