అన్వేషించండి

Vizag Crime News : 4నెలల కిందటే పెళ్లి ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మాహుతి ! ఓ శ్రావణి విషాదం

ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట శ్రావణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవల వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని ఇలాంటి నిర్ణయం తీసుకుంది.


Vizag Crime News :    అది విశాఖలోని  ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్. ఓ యువతి కాస్త వేగంగా బయటకు వచ్చింది. ముందే ప్లాన్ చేసుకుందో లేకపోతే ఆవేశంలో ఉన్న ఆమెకు అక్కడ దొరికిందో కానీ ఒంటి మీద పెట్రోల్ పోసుకుంది. ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల జనం అనుకునలోపే అంటించేసుకుంది. దీంతో జనం ఒక్క సారిగా షాక్ అయ్యారు. లోపల నుంచి ఎస్ఐ వేగంగా వచ్చి మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆయన చేతులూ కాలాయి. చివరికి ఎలాగోలా మంటల్ని ఆపి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె ప్రాణం నిలబడలేదు. అసలు ఎవరామే ? పోలీస్ స్టేషన్‌ ముందే ఎందుకు ఆత్మహుతి చేసుకుంది  ? ఈ వివరాలు తెలియాలంటే ఓ నాలుగునెలల ముందు ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్లాలి. 

నాలుగు నెలల కిందట గుంటూరులో !

గంటూరుకు చెందిన శ్రావణి..  విశాఖకు చెందిన వినయ్‌తో ఘనంగా పెళ్లి చేశారు కుటుంబీకులు. ఇద్దరి అనుమతితోనే పెళ్లి జరిగింది. కుటుంబసభ్యులందరూ హ్యాపీ ఫీలయ్యారు. తర్వాత రెండు కుటుంబాలు బాగానే ఉన్నాయి. తర్వాత విశాఖలో కాపురం పెట్టారు. కానీ దూరంగా ఉన్నప్పుడు బాగున్న వినయ్ - శ్రావణి దంపతులు... దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం మనసుల్ని కలుపులోకపోయారు. ఒకరి మాటలు మరొకరికి సూటిపోటిగా తగలడం ప్రారంభమైంది. చివరికి శ్రావణి  భరించలేకపోయింది.  కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. 

శుక్రవారం విశాఖలో !

అలా శ్రావణి.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిబంధనల ప్రకారం ముందుగా కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నారు. అందుకే భార్య భర్తలు ఇద్దర్నీ పలిచారు. ఎస్ ఐ కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఈ లోపు వారి మధ్య మళ్లీ మాటా మాటా పెరిగింది. చివరికి వినయ్ అన్న మాటలకు మరోసారి హర్ట్ అయిన శ్రావణి వెంటనే ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఒళ్లు పూర్తిగా కాలిపోవడంతో చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. 

పోలీసుల అదుపులో భర్త !

ఎస్ఐ కూ గాయాలు కావడంతో... వెంటనే అయననూ ఆస్పత్రికి తరలించారు. శ్రావణి  భర్త వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే  వినయ్, శ్రావణి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రావణి   ప్రస్తుతం న్యాయవిద్య అభ్యసిస్తోందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్య నిర్ణయం తీసుకుందని.. కలిసి జీవించడం ఇష్టం లేకపోతే ... విడాకులు తీసుకుంటే సరిపోయేదని ఆమె బంధువులు విలపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే ఒకరు ఇలా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం సంచలనం సృష్టించింది. 

భార్య భర్తల మధ్య వివాదాలు చేసేందుకు పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా అనేక మంది జంటల్ని కలుపుతున్నారు. అయితే  కొన్ని జంటలు మాత్రం తమ మధ్య ఏర్పడిన అపోహలను తొలగించుకోవడం కన్నా పెంచుకుంటున్నాయి. క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  పోలీసులు కూడా  ఊహించలేకపోతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget