అన్వేషించండి

Vijayawada News: విజయవాడలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన తల్లి

Crime News: విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అటు, అనంతపురంలో ఓ వ్యక్తి భార్య గొంతు కోసి పరారయ్యాడు.

Woman Jumped Into The Canal With Her Two Children: ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో.. ఏమో..? తన ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ తీవ్ర విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో (Vijayawada) ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ బందరు కాలువలో దూకింది. దీన్ని గమనించిన స్థానికులు ఏడాది వయసున్న చిన్నారిని బయటకు తీశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ, మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

భార్య గొంతు కోసిన భర్త

అటు, అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంత జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి.. అదే గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల ఇరువురి మధ్య ఘర్షణ జరగ్గా.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెకు నచ్చచెప్పేందుకు ఆమె ఇంటికి వెళ్లిన స్వామి ఆదివారం తెల్లవారుజామున భార్య గొంతు కోసి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Also Read: Crime News: నిద్ర లేచి చూసే సరికి రూ.2.50 కోట్ల బంగారం దోచేశారు - రైలులో భారీ దోపిడీ, ఎక్కడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Borugadda Anil: సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
Hindu Gods: హిందూ దేవుళ్లంటే అంత అలుసా ? స్విమ్ సూట్లు, అండర్‌వేర్లు, చెప్పులపై  ఫోటోలు - వాల్‌మార్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం
హిందూ దేవుళ్లంటే అంత అలుసా ? స్విమ్ సూట్లు, అండర్‌వేర్లు, చెప్పులపై ఫోటోలు - వాల్‌మార్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం
Embed widget