అన్వేషించండి

Crime News: నిద్ర లేచి చూసే సరికి రూ.2.50 కోట్ల బంగారం దోచేశారు - రైలులో భారీ దోపిడీ, ఎక్కడంటే?

Andhra News: హుబ్బళ్లి - విజయవాడ రైలులో భారీ చోరీ జరిగింది. రూ.2.50 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచేశారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Gold Theft In Hubballi Vijayawada Express Train: ఓ ఎక్స్ ప్రెస్ రైలులో భారీ చోరీ జరిగింది. బాధితులు నిద్ర లేచి చూసేసరికి దుండగులు రూ.2.50 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలను అపహరించారు. కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ (Vijayawada) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, రంగారావు సత్తెనపల్లిలో 'సాయిచరణ్ జ్యువెలర్స్' పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. వీరు ఆభరణాలు తయారు చేసి కర్ణాటకలోని బళ్లారిలో విక్రయిస్తుంటారు. ఇందులో భాగంగానే రంగారావు, ఆయన సోదరుడు సతీశ్‌బాబుతో కలిసి బంగారు ఆభరణాలను తీసుకుని మంగళవారం రాత్రి సత్తెనపల్లి నుంచి బళ్లారి వెళ్లారు. 3 రోజుల పాటు అక్కడే ఉండి పలువురు వ్యాపారులను సంప్రదించినా.. వారి ఆభరణాల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో శుక్రవారం రాత్రి హుబ్బళ్లి - విజయవాడ రైలులో తిరుగు ప్రయాణమయ్యారు.

నిద్ర లేచి చూసే సరికి..

ప్రయాణంలో నంద్యాల (Nandyal) వరకూ మెళకువగా ఉన్నా.. రంగారావు ఆభరణాల బ్యాగును తన తల కింద పెట్టుకుని నిద్రపోయారు. రైలు దొనకొండ సమీపానికి వచ్చే ముందు మెళకువ వచ్చి చూడగా బ్యాగు మాయమైంది. దీంతో ఆందోళనకు గురైన వారు దొనకొండ రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. అక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ లేకపోవడంతో కొందరు మార్కాపురం వెళ్లాలని సూచించారు. అక్కడ వారు నర్సరావుపేట వెళ్లాలని చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లారు. అక్కడి రైల్వే పోలీసులు పలు ప్రశ్నలు అడిగి చోరీ జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని.. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే, దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిందని తెలిసినా.. దొంగలను పట్టుకునేందుకు వెంటనే స్పందించకపోగా.. పరిధి పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. 

Also Read: Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget