Crime News: జూబ్లీహిల్స్ హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు, కీలక నిందిడు రౌడీషీటర్ ను తప్పించే యత్నం
Murder Case: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ రియాల్టర్ హత్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు, కీలక నిందితుడు రౌడీషీటర్ జిలానీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు
Crime News: జూబ్లీహిల్స్ హానీట్రాప్( Hony Trap) మర్డర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. హత్య జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారని పోలీసులకు ప్రసంశలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే...కీలకమైన నిందితులను వారే తప్పించారన్న ప్రచారం జరుగుతోంది. హత్యలో రౌడీషీటర్ జిలానీ పాల్గొన్నట్లు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా ఉన్నా...ఇప్పటికీ పోలీసులు జిలానీని అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
హత్యకేసులో ట్విస్ట్
యూసఫ్ గూడలో స్తిరాస్తి వ్యాపారి సింగోటం రాము (Singotam Ramu)హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. హానీట్రాప్ మాయలో పడేసి రామన్నను అతి కిరాతకంగా నరికి చంపేశారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతోపాటు ప్రధాన నిందితుడు మణికంఠ(Manikanta)ను గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యలో పాల్గొన్న మరో కీలక నిందితుడు రౌడీషీటర్ జిలానీ(Jilani)ను పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాము కేసులో అసలు నిందితులను పోలీసులు తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రౌడీషీటర్ జిలానీ గతంలోనూ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండి పోలీసుల(TG Police) సాయంతోనే తప్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అతనిపై పలు హత్య కేసులు, అటెంప్ట్ మర్డర్, బెదిరింపు కేసులు ఉన్నాయి. అయినా పోలీసులు తాత్సారం చూపించడం చూస్తుంటే..ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాదాపూర్ లో ల్యాండ్ వివాదంలో రియల్ ఎస్టేట్( Real Estate) వ్యాపారులపై కాల్పులు జరిపిన ఘటనలో జిలానీ ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడు. గతంలో బోరబండకు చెందిన నదీం అనే యువకుడ్ని హత్య చేసిన కేసు లో పోలీసులు రౌడీ షీటర్ జిలానీ ని తప్పించారని నదీం కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.
కలిసికట్టుగా పథకం
స్తిరాస్థి వ్యాపారంలో తలెత్తిన ఆర్థిక లావాదేవీల కారణంగా సింగోటం రాముపై కక్షపెట్టుకున్న మణికంఠ...జిలానీతో కలిసి హత్యక ప్రణాళిక రచించారు. ఇప్పటి వరకు పోలీసులు ఇదే విషయం చెబుతున్నా....రాముకి జిలానీకి మధ్య కూడా ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులను బెదిరించడం, సెటిల్మెంట్లు చేయడం జిలానీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలోనూ ఇలాంటి కేసుల్లో తలదూర్చి జైలుకు వెళ్లి వచ్చిన అనుభవం ఉండటంతో సింగోటం రామన్న, రౌడీషీటర్ జిలానీ మధ్య కూడా ఏమైనా ఆర్థిక లావాదేవీలు కొనసాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య జరిగిన అనంతరం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యకంగా టీంలు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి.
హత్య నేపథ్యం
స్తిరాస్థి వ్యాపారంలో నగదు లావాదేవీల్లో తలెత్తిన విభేదాల కారణంగా రాముపై కక్షపెంచుకున్న మణికంఠ...ఎలాగైనా అతన్ని అంతమొందించాలని పథకం వేశాడు. యూసఫ్ గూడకు చెందిన హిమాంబి అనే మహిళను సంప్రదించగా....ఆమె కుమార్తె ద్వారా హానీట్రాప్ కు పాల్పడి రాముని మహిళ ఇంటికి పిలిపించారు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో అదును చూసి రౌడీషీటర్ జిలానీతో కలిసి మణికంఠ హత్యకు పాల్పడ్డాడు.ఈ హత్యలో దాదాపు 10 మంది యువకులు పాల్గొన్నారు. రాము ఒంటిపై విచక్షణరహితంగా 50 సార్లు కత్తితో దాడి చేసి చంపేశారు.