అన్వేషించండి

Crime News: 'భారతీయుడు - 2' సినిమా చూస్తుండగా కత్తితో పొడిచేశాడు - భయంతో ప్రేక్షకుల పరుగులు

Warangal News: థియేటర్‌లో సినిమా చూస్తుండగానే ఓ యువకునిపై వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేటలో శుక్రవారం సాయంత్రం జరిగింది. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Young Man Attacked With Knife While Watching Movie In Warangal: 'భారతీయుడు - 2' సినిమా చూస్తుండగా ఓ వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు ఒక్కసారిగా పరుగులు తీశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ (Warangal) జిల్లా వర్థన్నపేటలోని ఓ థియేటర్‌లో కృష్ణ అనే వ్యక్తి విజయ్ అనే యువకున్ని కత్తితో పొడిచాడు. దీంతో ప్రేక్షకులు ఆందోళన చెంది బయటకు పరుగులు తీశారు. తీవ్ర గాయాలైన విజయ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదే కారణమా.?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఊర కృష్ణ, రాజ్ కుమార్‌లు అన్నదమ్ములు. ఇల్లందలో కృష్ణ, రాజ్ కుమార్‌లు వర్ధన్నపేటలో పాత ఇనుప సామాను కొట్టు నడుపుకొంటున్నారు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కళ్లెం విజయ్ కొన్ని నెలలుగా వర్థన్నపేట మండలం ఇల్లందలో తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. రాజ్ కుమార్ వద్ద పనికి కుదిరాడు. ఈ క్రమంలో కృష్ణ కూతురితో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న కృష్ణ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి రూ.50 వేల జరిమానా విధించాడు. అయితే, తన కూతుర్ని ప్రేమించడాన్ని మనసులో పెట్టుకున్న కృష్ణ శుక్రవారం విజయ్‌పై దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఇరు కుటుంబాలతో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ఇంకొన్ని కుటుంబాలన్నీ కలిసి వనభోజనాల కోసం బయటకు వెళ్లారు. అక్కడ విందు అనంతరం వర్ధన్నపేటలో సినిమాకు వెళ్లారు. 

ఇదే క్రమంలో కృష్ణ కోపంతో తనతో తెచ్చుకున్న కత్తితో ముందు సీట్లో కూర్చున్న విజయ్‌పై దాడికి పాల్పడ్డాడు. కడుపు, వెన్ను భాగంలో బలంగా పొడిచాడు. అడ్డుకోబోయిన మరో యువకుడిపైనా దాడి చేశాడు. అప్పటివరకూ సినిమా చూస్తూ సందడి చేసిన తోటి ప్రేక్షకులు ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విజయ్‌పై దాడి చేసిన కృష్ణ నేరుగా ఇల్లంద వెళ్లి అక్కడ అతని బంధువులపైనా దాడికి పాల్పడ్డాడు. వారు భయంతో పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఇటీవలే వరంగల్ జిల్లా తనను ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారనే అక్కసుతో ఓ యువకుడు యువతి తల్లిదండ్రులను దారుణంగా హతమార్చాడు. ఆ ఘటన మరువక ముందే మరో హత్యాయత్నం జరగడంతో ఆందోళన నెలకొంది.

Also Read: Kakatiya University: కేయూ హాస్టల్‌లో ఊడిపడిన శ్లాబ్ - రిజిస్ట్రార్‌ను నిలదీసిన విద్యార్థులు, అర్ధరాత్రి ఉద్రిక్తత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget