అన్వేషించండి

Strange Incident: కొంప ముంచిన కోతి - అరటి పండు ఇస్తే కింద పడేసింది, సీన్ కట్ చేస్తే!

Kadapa News: కడప జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కోతి కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కత్తిపోట్ల వరకూ దారి తీసింది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.

Strange Incident In Kadapa District: ఓ కోతి.. అరటిపండు.. సీన్ కట్ చేస్తే ఓ వ్యక్తికి కత్తిపోట్లు. ఇది కడప జిల్లాలో జరిగిన విచిత్ర సంఘటన. ఓ కోతికి వ్యక్తి అరటిపండు ఇస్తే అది తినకుండా కింద పడేసింది. దీంతో సదరు వ్యక్తి కోతిని దూషించగా.. కోతి యజమాని కోపంతో అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలోని (Kadapa District) రైల్వేకోడూరులో రైలులో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుని సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓబులావారిపల్లె (Obulavaripalle) మండలం బొంతవారిపల్లెకు చెందిన జవ్వాది లక్ష్మయ్య, రేవూరి సునీల్ కుమార్, పండుగోల శేఖర్‌లు ఆదివారం రేణిగుంట సమీపంలోని కరకంబాడి వద్ద ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి తిరుగు ప్రయాణమయ్యారు.

వానరం కారణంగా వాగ్వాదం

వీరు ఎక్కిన రైలులోని బోగీలో కోతిని ఆడిస్తూ జీవనం సాగించే రెహమాన్ అనే వ్యక్తి డోర్ వద్ద వానరంతో కూర్చున్నాడు. ఇది గమనించిన సునీల్ కుమార్ కోతికి అరటిపండు ఇచ్చాడు. అయితే, అది తినకుండా పండు కింద పడేయడంతో సునీల్ కోతిని దూషించాడు. వెంటనే కోతి యజమాని రెహమాన్ అతనితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. సునీల్ స్నేహితులు సైతం అక్కడకు వచ్చి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రెహమాన్ తీవ్ర ఆగ్రహంతో కత్తితో సునీల్‌పై దాడికి పాల్పడ్డాడు. అతని వీపు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కాగా.. రెహమాన్ బాలపల్లె స్టేషన్‌లో దిగి పారిపోయాడు. బాధితున్ని అతని స్నేహితులు రైల్వే కోడూరులో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని.. నిందితుడిని బాలపల్లెలో అదుపులోకి తీసుకున్నామని రేణిగుంట రైల్వే ఎస్సై రవి అన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని రైల్వే కోడూరు పోలీసులు తెలిపారు.

Also Read: Crime News: ఏపీలో దారుణాలు - డబ్బులివ్వలేదని భార్య గొంతు కోసి చంపేసిన భర్త, మరోచోట భర్త అనుమాన వేధింపులతో భార్య ఆత్మహత్య

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget