Madanapalle Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి
Madanapalle Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
![Madanapalle Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి 5 people Dies in Road Accident at Madanapalle in Annamayya district Madanapalle Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/25/3e990f398e39c8d42a028843721a226b1708875218352233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Road Accident at Madanapalle in Annamayya district: మదనపల్లె: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మదనపల్లె నియోజకవర్గం బార్లపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు గాయపడ్డారు. చనిపోయిన వారిని స్థానికులు అని ప్రాథమికంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన చోట భయానక వాతావరణం కనిపించింది. కొందరికి కాళ్లు తెగి పడగా, మరికొందరికి చేతులు, ఇతర భాగాలు తెగిపడి ఘటనా స్థలం చూడాలంటేనే భయం కలిగే విధంగా తయారైంది. కారు నెంబర్ ఏపీ 39NS 8439 అని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బార్లపల్లి వద్ద ఆదివారం రాత్రి స్కార్పియో స్కూటర్ ఢీకొనడంతో స్కూటర్లో ప్రయాణిస్తున్న కోళ్ల వారి పల్లి కి చెందిన ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్కార్పియో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి పోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని దీకొట్టి మరో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనకు సంబంధించి మదనపల్లి తాలూకా సి ఐ ఎన్ శేఖర్ కథనం మేరకు వివరాలు.. మదనపల్లి మండలం బార్లపల్లి సమీపంలోని కోళ్ల వారి పల్లి కు చెందిన చంద్ర, సుబ్రహ్మణ్యం ఆచారిలు పాలు పోయడానికి బెంగళూరు రోడ్డుకు బైకులో వచ్చారు. పాలు పోసి ఇంటికి వెళుతున్న సమయంలో మదనపల్లి రామారావు కాలనీకి చెందిన ఓ స్కార్పియో బెంగళూరుకి వెళ్లి పని ముగించుకుని తిరిగి మదనపల్లికి వచ్చే క్రమంలో పాలు పోసి వెళుతున్న బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కోళ్లబారిపల్లికి చెందిన చంద్ర సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ప్రమాదం చేసి తప్పించుకుని పారిపోయే క్రమంలో స్కార్పియో మరికొంత దూరం మదనపల్లి వైపు వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో స్కార్పియో లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోయిన వారంతా మదనపల్లి పట్టణం, రూరల్ మండలానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన కొందరి వివరాలు తెలియాల్సి ఉండగా మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చిది తరలించికేసు నమోదు చేసినట్లు సీఐఎన్ శేఖర్ తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)