News
News
వీడియోలు ఆటలు
X

Missing Women: గుజరాత్‌లో 40 వేల మంది మహిళల మిస్సింగ్, NCRB లెక్కల సంచలనం

Missing Women: గుజరాత్‌లో ఐదేళ్లలో 40 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని NCRB వెల్లడించింది.

FOLLOW US: 
Share:

Missing Women in Gujarat: 

ఐదేళ్లలో వేలాది మంది అదృశ్యం..

ఐదేళ్లలో గుజరాత్‌లో 40 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. National Crime Records Bureau (NCRB) స్వయంగా ఈ లెక్కలు వెల్లడించింది. 2016 నుంచి సంవత్సరం వారీగా ఎంత మంది మహిళలు మిస్ అయ్యారో గణాంకాలు విడుదల చేసింది. 2016లో 7,015, 2017లో 7,712, 2018లో 9,246, 2019లో 9,268 మంది మహిళలు కనిపించకుండా పోయారు. ఆ తరవాత కూడా మిస్సింగ్ కేసులు పెరుగుతూనే వచ్చాయి. 2020లో 8,290 మంది అదృశ్యమయ్యారు. ఇలా మొత్తంగా కలుపుకుంటే 41,621 మంది మహిళలు మిస్ అయ్యారు. 2021లో అసెంబ్లీలో ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు వెల్లడించింది. 2019-20 మధ్య కాలంలో 4,722 మంది మహిళలు అహ్మదాబాద్, వడోదర ప్రాంతాల్లో అదృశ్యమైనట్టు తెలిపింది. మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం సభ్యుడు సుధీర్ సిన్హా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

"కొన్ని మిస్సింగ్ కేసులలో బాలికలు, మహిళలను బలవంతంగా గుజరాత్ నుంచి వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు" అని స్పష్టం చేశారు. పోలీస్ సిస్టమ్‌లో ఉన్న సమస్యేంటంటే...మిస్సింగ్ కేసులను పెద్దగా పట్టించుకోరు. కానీ...ఇవి మర్డర్‌ల కన్నా సీరియస్‌గా తీసుకోవాల్సిన కేసులు. ఓ చిన్నారి కనిపించకుండా పోయిందంటే...తల్లిదండ్రులు ఏళ్ల పాటు వేచి చూడాల్సి వస్తోంది. మర్డర్‌ కేసులను ఎలా అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారో..అలాగే మిస్సింగ్ కేసులనూ విచారించాలి. ఇలాంటి కేసుల్లో విచారణ ఇంకా బ్రిటీష్ కాలం నాటి పద్ధతుల్లోనే కొనసాగుతున్నాయి. "

- సుధీర్ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి 

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు అమ్మాయిలను ట్రాప్ చేసి వేరే రాష్ట్రాలకు, దేశాలకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో ఓ మాజీ పోలీస్ అధికారి వివరించారు. 

"నేను ఎస్‌పీగా పని చేసినప్పుడు యూపీలో ఓ కార్మికుడు ఓ పేద కుటుంబానికి చెందిన అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకొచ్చాడు. ఓ ముఠాకు ఆ అమ్మాయిని అమ్మేశాడు. వ్యవసాయ కూలీగా ఆమెతో బలవంతంగా పనులు చేయించారు. ఎలాగోలా ట్రాక్ చేసి ఆ అమ్మాయిని రక్షించాం. కానీ ప్రతిసారి ఇలా కూలీ పనులే చేయిస్తారని లేదు. పడుపు వృత్తిలోకి దింపుతారు అలాంటి పరిస్థితులు ఎవరికీ రావద్దు."

- మాజీ పోలీస్ అధికారి

ఈ లెక్కలపై కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు మొదలు పెట్టింది. మహిళల గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే బీజేపీ...గుజరాత్‌లో అంత మంది అమ్మాయిలు మిస్ అవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన గుజరాత్‌లోనే పరిస్థితులు ఇలా ఉంటే ఎలా..? అని మండి పడుతోంది. 

Published at : 07 May 2023 05:19 PM (IST) Tags: NCRB women missing Missing Women Gujarat Women Missing

సంబంధిత కథనాలు

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

టాప్ స్టోరీస్

Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల