Tractor Accident: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా - నలుగురు చిన్నారులు సహా 13 మంది దుర్మరణం
Madhyapradesh News: మధ్యప్రదేశ్‌లోని రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Severe Road Accident In MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లోని (MadhyaPradesh) రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని భోపాల్ తరలించినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని మోతీపురాకు చెందిన 30 మంది మధ్యప్రదేశ్‌లోని కులంపూర్‌లో జరిగే పెళ్లికి ట్రాక్టర్‌లో బయలుదేరగా.. రాజ్ గఢ్ జిల్లాలోని పీప్ లోడీ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఎంపీ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో రాజ్ గఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి నారాయణ్ సింగ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని సీఎం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. అటు, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
Rajgarh Accident | President of India tweets, "The news of the death of many people in a road accident in Rajgarh district of Madhya Pradesh is very sad. I express my deepest condolences to the families who lost their loved ones and pray for the speedy recovery of the injured." pic.twitter.com/f5qwZ7sHPi
— ANI (@ANI) June 2, 2024
Rajgarh Accident | Madhya Pradesh CM Mohan Yadav says, "The news of the untimely death of 13 people from the Jhalawar district of Rajasthan due to the overturning of a tractor-trolley on Piplodi Road in Rajgarh district is extremely sad. Leader Narayan Singh Panwar along with the… pic.twitter.com/RnzgNV5y0m
— ANI (@ANI) June 2, 2024
Rajasthan CM Bhajanlal Sharma condoles the demise of 13 people from Jhalawar who died in a road accident in Madhya Pradesh.
— ANI (@ANI) June 3, 2024
The CM tweets that senior officials of Rajasthan have been directed to coordinate with officers in Madhya Pradesh and bring the bodies of the deceased to… https://t.co/HVgWACmsO2 pic.twitter.com/wuJYHbamlN
#WATCH | Rajgarh Accident | Madhya Pradesh: Harsh Dikshit, DM Rajgarh says, "Some people from Rajasthan were coming to the state to attend a wedding, in a tractor. Near the Rajasthan-Rajgarh border, the tractor was overturned in which 13 people died and 15 were injured. Two… pic.twitter.com/9uBKPSHDZ5
— ANI (@ANI) June 2, 2024
Also Read: Bomb Threat: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు, ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటన