Zomato: ఆస్తులు తెగ కొంటున్న జొమాటో సీఈవో, దిల్లీలో రెండు కొత్త డీల్స్
Zomato share price: రెండు డీల్స్‌కు కలిపి మొత్తం రూ.79 కోట్లను జొమాటో సీఈవో చెల్లించారు.
Zomato CEO Deepinder Goyal Buys Lands In Delhi: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్, తన ఆస్తులను బాగా పెంచుకుంటున్నారు. తాజాగా, దేశ రాజధానిలో రెండు ఓపెన్ ప్లాట్ల (Open plots) కోసం డీల్ క్లోజ్ చేశారు. దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో, మొత్తం 5 ఎకరాల భూమిని దీపిందర్ గోయల్ కొనుగోలు చేశారు. ఈ రెండు డీల్స్ గత సంవత్సరంలో (2023) పూర్తయ్యాయి. రెండు డీల్స్‌కు కలిపి మొత్తం రూ.79 కోట్లను జొమాటో సీఈవో చెల్లించారు. అంతేకాదు, స్టాంప్ డ్యూటీ కింద మొత్తం 5.24 కోట్ల రూపాయలు కట్టారు.
రెండు డీల్స్ ఎప్పుడు జరిగాయి?
మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం, దీపిందర్ గోయల్ మొదటి కొనుగోలు 2023 మార్చి 28న జరిగింది. లగ్జలాన్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (LUXALON BUILDING PRIVATE LIMITED) 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ రూ. 29 కోట్లు. భూమి రిజిస్ట్రేషన్ కోసం అతను రూ. 1.74 కోట్లు స్టాంప్ డ్యూటీగా చెల్లించారు.
జొమాటో సీఈవో రెండో ల్యాండ్ డీల్ 2023 సెప్టెంబర్ 01న పూర్తయింది, ఇందులో, 2.53 ఎకరాల భూమిని రవి కపూర్ అనే వ్యక్తి నుంచి రూ. 50 కోట్లకు దీపిందర్ గోయల్ కొన్నారు. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 3.50 కోట్లు స్టాంపు డ్యూటీగా చెల్లించారు. ఈ రెండు భూములు దిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలోని డేరా మండి గ్రామం పరిధిలో ఉన్నాయి.
అయితే, ఈ రెండు ల్యాండ్ డీల్స్‌పై జొమాటో నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
శుక్రవారం, (02 ఫిబ్రవరి 2024) జొమాటో షేర్ ధర 2.24% పెరిగి రూ. 143.70 వద్ద ముగిసింది. దీని 52-వారాల గరిష్టం రూ.145. ఈ స్టాక్ గత ఆరు నెలల్లో 66%, గత ఒక ఏడాది కాలంలో దాదాపు 195%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 15% పెరిగింది.
మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్, ఎక్కువ వడ్డీకి గ్యారెంటీ, గడువు కూడా పెంపు
దిల్లీ-NCRలో పెద్ద భూ ఒప్పందాలు
గత కొన్ని నెలలుగా, చాలా మంది ప్రముఖులు, సంపన్నులు దిల్లీతోపాటు NCR (National Capital Region) పరిధిలో భూములు కొంటున్నారు, ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి (EaseMyTrip Co-founder Rikant Pittie), దిల్లీకి ఆనుకుని ఉన్న గురుగావ్ ప్రాంతంలో రూ. 99.34 కోట్లు వెచ్చించి, ఒక కమర్షియల్ ప్రాపర్టీని సొంతం చేసుకున్నారు.
లెన్స్‌కార్ట్ యజమాని పీయూష్ బన్సల్ (Lenskart Founder Peyush Bansal) కూడా, దిల్లీలోని ఖరీదైన ఏరియాలలో ఒకటైన నీతి బాగ్ ప్రాంతంలో 18 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. మేక్ మై ట్రిప్ గ్రూప్ సీఈవో రాజేష్ మాగో (MakeMyTrip CEO Rajesh Magow), గురుగావ్‌లోని డీఎల్‌ఎఫ్ మాగ్నోలియాస్‌లో రూ. 32.60 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కొన్నారు.
మరో ఆసక్తికర కథనం: పేటీఎం షేర్లను అందరూ అమ్మతుంటే ఆ గ్లోబల్ కంపెనీ మాత్రం కోట్లలో కొంటోంది