By: Arun Kumar Veera | Updated at : 03 Feb 2024 12:37 PM (IST)
ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్
SBI Amrit Kalash Scheme Details: పెద్దగా రిస్క్ లేకుండా, కాస్త పెద్ద మొత్తంలో గ్యారెంటీ రిటర్న్ ఇచ్చే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఇది, మన దేశంలో పాపులర్ & సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్.
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), గత కొన్నేళ్లుగా ఒక స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తోంది, ఆ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయాన్ని గ్యారెంటీగా ఇస్తోంది. ఆ స్కీమ్ పేరు.. 'ఎస్‌బీఐ అమృత్ కలశ్'. ఈ పథకం గడువును బ్యాంక్ ఇప్పటికే పలుమార్లు పెంచింది.
ఇటీవల, ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకంలో పెట్టుబడి పెట్టే గడువును ఈ ఏడాది మార్చి నెలాఖరు (2024 మార్చి 31) వరకు బ్యాంక్ పొడిగించింది. అంటే, మంచి వడ్డీ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఇంకా రెండు నెలలు అందుబాటులోనే ఉంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం సంపాదించాలని ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఇది అనువైన ఆప్షన్.
ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్ వివరాలు:
వడ్డీ రేటు (SBI Amrit Kalash Scheme Interest Rate)
SBI అమృత్ కలశ్ పథకం టెన్యూర్ 400 రోజులు. ఈ టర్మ్ ప్లాన్‌లో డబ్బు (రూ. 2 కోట్ల లోపు) డిపాజిట్ చేసే సాధారణ పౌరులకు ఏడాదికి 7.1% వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది. ఇదే గడువులో సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం (0,50%) కలిపి ఏటా 7.6% వడ్డీ ఆదాయాన్ని జమ చేస్తుంది.
SBI అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్‌పై వచ్చే వడ్డీ విషయంలో.. నెలనెలా, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వంటి ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి ఖాతాలో వడ్డీ డబ్బు జమ అవుతుంది.
ఎవరు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు? (SBI Amrit Kalash Deposit Scheme Eligibility)
రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. అంటే, రూ.2 కోట్ల లోపు మొత్తంతో ఎఫ్‌డీ వేయాలనుకున్న అందరూ దీనికి అర్హులే. కొత్తగా ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.
ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? (How to apply for Amrit Kalash Online?)
ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్ కోసం ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అంటే.. మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ శాఖకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అక్కడి వరకు వెళ్లే పరిస్థితి లేకపోతే, ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేస్తుకోవచ్చు. దీనికోసం మీకు SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో (SBI YONO) ఉంటే చాలు. మీరు ఇంట్లోనే కూర్చుని, ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో ద్వారా ఎస్‌బీఐ అమృత్ కలశ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
ఒకవేళ మీకు అర్జంటుగా డబ్బు అవసరమైనా/ ఎఫ్‌డీని కొనసాగించలేకపోయినా, ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే (Amrit Kalash premature withdrawal) ఆప్షన్ కూడా ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్ మీద బ్యాంక్ లోన్ (loan against Amrit Kalash) కూడా వస్తుంది.
ఇన్‌కం టాక్స్ (Income Tax) రూల్స్ ప్రకారం, అమృత్ కలశ్ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై TDS కట్ అవుతుంది. ఇలా కట్ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: పేటీఎం షేర్లను అందరూ అమ్మతుంటే ఆ గ్లోబల్ కంపెనీ మాత్రం కోట్లలో కొంటోంది
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Rupee Weakening Effect in India:రూపాయి బలహీనపడటం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
Gold Price: బంగారం రన్ ఇప్పట్లో ఆగదా! ధర 1.50 లక్షలకు చేరుకుంటుందా?
Railway Tatkal Ticket Booking Rules: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ మారాయి - ఇకపై OTP తప్పనిసరి!
Rent Agreement Rules 2025 : అద్దెదారుల టెన్షన్‌కు పుల్‌స్టాప్, గృహ యజమానులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు! కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?
Akhanda 2: ‘హిందూ మతం’ - ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పడని బ్రేక్! ఉభయ గోదావరి జిల్లాల్లో రెచ్చిపోతున్న రేషన్ రైస్ మాఫియా!
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Virat Kohli Earnings : విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy