X

ZEE Merging with Sony: విలీనమైన దిగ్గజ మీడియా సంస్థలు.. జీ-సోనీ మధ్య ఒప్పందం, పూర్తి వివరాలివీ..

విలీనం అనంతరం సోనీ సంస్థకు ఎక్కువగా 52.93 శాతం వాటా దక్కగా.. జీ సంస్థకు 47.07 శాతం చొప్పున వాటా లభించనుంది.

FOLLOW US: 

దేశంలోని మీడియా రంగంలో ఓ పెద్ద పరిణామం చోటు చేసుకుంది. రెండు దిగ్గజ మీడియా సంస్థల విలీనం జరిగింది. ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ZEEL) - సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) రెండూ కలుస్తున్నాయి. ఈ మేరకు రెండు సంస్థల మధ్య విలీన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు జీ సంస్థ వెల్లడించింది. 

ఇరు సంస్థలకు వాటా ఇలా..
అయితే, విలీనం అనంతరం సోనీ సంస్థకు ఎక్కువగా 52.93 శాతం వాటా దక్కగా.. జీ సంస్థకు 47.07 శాతం చొప్పున వాటా లభించనుంది. విలీనం అయిన తర్వాత సంస్థకు ప్రస్తుత జీ సీఈవో అయిన పునీత్ గోయెంకానే మరో ఐదేళ్ల పాటు ఎండీ, సీఈవోగా వ్యవహరించనున్నట్లుగా ఒప్పందం కుదిరింది. మరోవైపు, విలీనం తర్వాత సోనీ పిక్చర్స్‌ 1.575 బిలియన్‌ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. 

Also Read: Online Payment: మీరు ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తారా? త్వరలో కొత్త రూల్ ఇదే..

జీ ప్రమోటర్లు, సోనీ పిక్చర్స్ ప్రమోటర్ల మధ్య పోటీ లేని మరికొన్ని అంశాలపై కూడా ఒప్పందం జరుగుతుంది. టర్మ్ షీట్ ప్రకారం, సంబంధిత చట్టానికి లోబడి ప్రమోటర్ కుటుంబం వారికి ఉన్న ప్రస్తుత 4 శాతం వాటా నుంచి 20 శాతం వాటాకు పెంచుకోవడానికి వీలు ఉంటుంది. మరోవైపు, విలీన సంస్థ కోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఎక్కువ మందిని సోనీ గ్రూప్ నామినేట్ చేస్తుంది. ఇక ఒప్పంద అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయడానికి 90 రోజుల గడువు నిర్దేశించారు.

Also Read: Flying Car : మేడిన్ చెన్నై బ్రాండ్ ఎగిరే కారు ! రిలీజ్ ఎప్పుడు అంటే...?

కంటెంట్ క్రియేషన్‌లో ZEE కి మంచి పేరు
ఆర్థికపరమైన అంశాలే కాకుండా సోనీతో భాగస్వామ్యం వల్ల రానున్న వ్యూహాత్మక వ్యాల్యూను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా జీ బోర్డు ప్రకటించింది. విలీన సంస్థ దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ రెండు దిగ్గజ సంస్థల ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభం అని వెల్లడించింది. ఇకపై రెండు కంపెనీలు లీనియర్‌ నెట్‌వర్క్స్‌, డిజిటల్‌ అసెట్స్‌, ప్రొడక్షన్‌ ఆపరేషన్స్‌, ప్రోగ్రాం లైబ్రరీ వంటి వాటిని పంచుకోనున్నారు. 40 ఏళ్లుగా జీ సంస్థకు కంటెంట్‌ క్రియేషన్‌లో మంచి అనుభవం ఉంది. జనాల్లో కూడా జీ సంస్థ మంచి పేరు సంపాదించింది. సోనీ సంస్థ గేమింగ్‌, స్పోర్ట్స్‌ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు అత్యంత ప్రజాదరణ దక్కుతుందని, విలువ కూడా భారీగా చేకూరుతుందని భావిస్తున్నారు.

Also Read: e-SHRAM: ఈ గవర్నమెంట్ పోర్టల్‌లో ఫ్రీగా చేరండి, ఏకంగా రూ.2 లక్షల బెనిఫిట్ పొందండి.. పూర్తి వివరాలివీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ZEE Entertainment Enterprises Sony Pictures Networks ZEE Merging with Sony ZEE Sony Merging news ZEE Sony News

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 26 January: గుడ్‌న్యూస్.. నేడు అన్ని చోట్లా తగ్గిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే స్థిరంగా..

Petrol-Diesel Price, 26 January: గుడ్‌న్యూస్.. నేడు అన్ని చోట్లా తగ్గిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే స్థిరంగా..

Gold-Silver Price: రిపబ్లిక్ డే నాడు ఎగబాకిన బంగారం.. వెండి నేల చూపులు, నేటి ధరలు ఇవే..

Gold-Silver Price: రిపబ్లిక్ డే నాడు ఎగబాకిన బంగారం.. వెండి నేల చూపులు, నేటి ధరలు ఇవే..

Micromax In Note 2: మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఏంటంటే? కెమేరా సెటప్‌ అదుర్స్‌!!

Micromax In Note 2: మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఏంటంటే? కెమేరా సెటప్‌ అదుర్స్‌!!

Union Budget 2022: నిత్యావసర ధరలకు కళ్లెం, సొంత కాళ్లపై నిలబడేలా సాయం.. నిర్మలమ్మ నుంచి ఈ సారి మహిళలు కోరుకుంటున్నది ఇదే !

Union Budget 2022: నిత్యావసర ధరలకు కళ్లెం, సొంత కాళ్లపై నిలబడేలా సాయం.. నిర్మలమ్మ నుంచి ఈ సారి మహిళలు కోరుకుంటున్నది ఇదే !

Self Driving Vehicles: ఈ కారుకు డ్రైవర్ అవసరం లేదు.. త్వరలో తీసుకురానున్న ప్రముఖ బ్రాండ్!

Self Driving Vehicles: ఈ కారుకు డ్రైవర్ అవసరం లేదు.. త్వరలో తీసుకురానున్న ప్రముఖ బ్రాండ్!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP New District List: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలకు నెల గడువు

AP New District List: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలకు నెల గడువు

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022

Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..