By: ABP Desam | Updated at : 21 Sep 2021 01:41 PM (IST)
Edited By: Rajasekhara
ఎగిరే కారును సిద్ధం చేస్తున్న చెన్నై కంపెనీ
ఎగిరే కారు సినిమాల్లోనే చూసి ఉంటారు. మూడు నెలల కిందట స్లోవేకియా ఇలాంటి ఓ కారును ట్రయల్ రన్ నిర్వహించిన అంశం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు ఇండియాలోనూ అలాంటి ఎగిరే కార్లు రెడీ అవబోతున్నాయి. దీనికి సంబంధించి ముందడుగు పడింది. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. చెన్నైకి చెందిన వినాతా ఏరో మొబిలిటి అనే సంస్థ ఆసియా మొట్ట మొదటి హైబ్రీడ్ ఫ్లైయింగ్ కార్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కారు కాన్సెప్ట్‌తో తయారు చేసిన చిన్న కారును తీసుకెళ్లి సింధియాకు చూపించారు. వీటిని చూసి ముచ్చటపడిన కేంద్రమంత్రి ఫోటోలు తీసి ట్విట్టర్‌లో పెట్టారు.
Delighted to have been introduced to the concept model of the soon-to-become Asia’s First Hybrid flying car by the young team of @VAeromobility . 1/2 pic.twitter.com/f4k4fUILLq
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) September 20, 2021
Also Read : రాజ్ కుంద్రా ఫోన్లో 119 పోర్న్ వీడియోలు, వాటితో భారీగా.. ముంబయి పోలీసుల కీలక వివరాలు
వి.ఏ. ఏరో మొబిలిటి సంస్థ స్టార్టప్‌లాగా పని చేయడం ప్రారంభించింది. వినూత్న ఆలోచనలతో కూడిన యువ బృందం కంపెనీని డీల్ చేస్తోంది. ఒక్క సారి ఈ ఎగిరే కారు కాన్సెప్ట్‌ను సిద్ధం చేసిన తర్వాత భారత రవాణా రంగంలో సంచలనాత్మకమైన మార్పులు వస్తాయని కేంద్రమంత్రి సంతోషపడ్డారు. ఒక్క ప్రయాణికులనే కాకుండా నిత్యావసరాలు, మందులు సహా ముఖ్యమైన వాటినన్నింటినీ సులువుగా రవాణా చేయవచ్చునని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వి.ఏ. ఏరో మొబిలిటి సంస్థ బృందాన్ని అభినందించాు. డ్రోన్ రివల్యూషన్ ప్రారంభమయిందన్నారు.
Also Read : ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఇటీవలి కాలంలో డ్రోన్ల స్థాయిను వాహనాల స్థాయికి పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా యువ పరిశోథకులు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ల సామర్థ్యం అంతకంతకూ పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఇండియాలోనూ డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల సరఫరా ప్రారంభించారు. ఇలాంటి సమయంలో చెన్నైకు చెందిన వీ.ఏ. మొబిలిటి సంస్థ ఏకంగా ఏగిరే కార్ తయారీకి రంగం సిద్దం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ! రోడ్డున పడుతున్న రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ రాజకీయం !
ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎగిరే కారును ఒక్క సంస్థే రూపొందించింది. స్లొవేకియాకు చెందిన స్టీఫెన్ క్లిన్ దీని రూపకల్త. గత జూలైలో ఎగిరే కారు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. దాదాపు 8 వేల ఎత్తుకు ఎగిరి.. విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. 2.15 నిమిషాల్లోనే విమానంగా మారిపోయే ఈ కారు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. ఈ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించగలరు. ఈ కారుకు పోటీగా చెన్నై కుర్రాళ్లు ఎగిరే కారును రెడీ చేయబోతున్నారు.
Also Read : బీజేపీకి మజ్లిస్ మిత్రపక్షమా ? శత్రుపక్షమా ? ఎందుకు ఓట్లు చీల్చి సహకరిస్తోంది ?
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Maruti Suzuki: గ్రాండ్ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్
Bajaj Qute Auto Taxi: సామాన్యుల కోసం ‘బజాజ్ క్యూట్’ - మారుతీ ఆల్టోకు గట్టిపోటీ, ధర ఎంతంటే..
Maruti Suzuki: ఈ కార్ మోడల్స్ మీ దగ్గర ఉంటే వెంటనే కంపెనీకి తిప్పి పంపండి, ఆలస్యం చేస్తే ప్రాణగండం
Tata Motors: సఫారీ, హారియర్‌ల్లో రెడ్ ఎడిషన్లు లాంచ్ చేసిన టాటా - వావ్ అనిపించే ఫీచర్లు!
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?