News
News
వీడియోలు ఆటలు
X

Salary: ప్రపంచంలోని ఏ దేశంలో ఎక్కువ జీతం ఇస్తారో తెలుసా?, అమెరికాలో మాత్రం కాదు

టాప్‌-1లో ఉన్న స్విట్జర్లాండ్‌లో వచ్చే సగటు జీతం, భారత్‌లో లభించే సగటు జీతం కంటే 10 రెట్లు పైగా ఎక్కువ.

FOLLOW US: 
Share:

Worlds Highest Paying Country: ప్రపంచంలోని ఏ దేశంలో నెలవారీ జీతాలు ఎక్కువో తెలుసా?, అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం కాదు. ప్రపంచ పెత్తనం కోసం అమెరికాకు సవాళ్లు విసిరే చైనాలోనూ కాదు. ఉక్రెయిన్‌పై దండెత్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన రష్యాలో అంతకంటే కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మన దేశంలో జీతాల గురించి మాట్లాడుకుందాం.

వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం.. భారతీయుల సగటు నెల జీతం 50 వేల రూపాయల లోపే ఉంది. భారతదేశంతో పాటు, ప్రపంచంలోని అన్ని దేశాల పౌరుల సగటు నెలవారీ జీతాల గురించి ఆ నివేదిక వెల్లడించింది. 

అత్యధిక జీతం పొందే టాప్ 10 దేశాలు
నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక జీతాలు ఆఫర్‌ చేస్తున్న టాప్‌-10 దేశాలు.. 1. స్విట్జర్లాండ్, 2. లక్సెంబర్గ్, 3. సింగపూర్, 4. అమెరికా, 5. ఐస్‌లాండ్, 6. ఖతార్, 7. డెన్మార్క్, 8. యూఏఈ, 9. నెదర్లాండ్స్, 10. ఆస్ట్రేలియా.

సగటు జీతాల విషయంలో భారతదేశం ఎక్కడుంది?
నెలవారీ సగటు జీతం ఇచ్చే విషయంలో టర్కీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, బంగ్లాదేశ్, వెనిజులా, నైజీరియా, ఈజిప్ట్, పాకిస్థాన్ వంటి దేశాలు భారత్‌ కంటే దిగువన ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం 65వ స్థానంలో ఉండగా, పొరుగు దేశం పాకిస్థాన్ 104వ స్థానంలో ఉంది. డ్రాగన్‌ కంట్రీ చైనా 44వ స్థానంలో, భారత్‌ కంటే మెరుగ్గా ఉంది. 

టాప్‌-1లో ఉన్న స్విట్జర్లాండ్‌లో వచ్చే సగటు జీతం, భారత్‌లో లభించే సగటు జీతం కంటే 10 రెట్లు పైగా ఎక్కువ.                                                          

వీళ్లకు రూ. 4 లక్షలకు పైగా నెల జీతం
ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లోని పౌరులు అత్యధిక జీతం పొందుతున్నారు, వాళ్ల సగటు నెలసరి జీతం రూ. 4 లక్షల కంటే ఎక్కువ. స్విట్జర్లాండ్‌లో ఉద్యోగుల సగటు నెల జీతం రూ. 4,98,567 కాగా, లక్సెంబర్గ్‌ సగటున నెలవారీ జీతం రూ. 4,10,156గా ఉంది. సింగపూర్ వాసులు నెలకు సగటును రూ. 4,08,030 పొందుతున్నారు.

వివిధ దేశాల్లో నెలవారీ సగటు జీతాలు:

స్విట్జర్లాండ్: $6,096 (రూ. 4,98,567)
లక్సెంబర్గ్: $5,015 (రూ. 4,10,156)
సింగపూర్: $4,989 (రూ. 4,08,030)
USA: $4,245 (రూ. 3,47,181)
ఐస్‌లాండ్: $4,007 (రూ. 3,27,716)
ఖతార్: $3,982 (రూ. 3,25,671)
డెన్మార్క్: $3,538 (రూ. 2,89,358)
UAE: $3,498 (రూ. 2,86,087)
నెదర్లాండ్స్: $3,494 (రూ. 2,85,756)
ఆస్ట్రేలియా: $3,391 (రూ. 2,77,332)
నార్వే: $3,289 (రూ. 2,68,990)
జర్మనీ: $3,054 (రూ. 2,49,771)
కెనడా: $2,997 (రూ. 2,45,109)
UK: $2,924 (రూ. 2,39,139)
ఫిన్లాండ్: $2,860 (రూ. 2,33,905)
ఆస్ట్రియా: $2,724 (రూ. 2,22,782)
స్వీడన్: $2,721 (రూ. 2,22,534)
ఫ్రాన్స్: $2,542 (రూ. 2,07,894)
జపాన్: $2,427 (రూ. 1,98,489)
దక్షిణ కొరియా: $2,243 (రూ. 1,83,441)
సౌదీ అరేబియా: $2,002 (రూ. 1,63,731)
స్పెయిన్: $1,940 (రూ. 1,58,660)
ఇటలీ: $1,728 (రూ. 1,41,322)
దక్షిణాఫ్రికా: $1,221 (రూ. 99,857)
చైనా: $1,069 (రూ. 87,426)
గ్రీస్: $914 (రూ. 74,749)
మెక్సికో: $708 (రూ. 57,902)
రష్యా: $645 (రూ. 52,750)
భారతదేశం: $573 (రూ. 46,861)
టర్కీ: $486 (రూ. 39,746)
బ్రెజిల్: $418 (రూ. 34,185)
అర్జెంటీనా: $415 (రూ. 33,939)
ఇండోనేషియా: $339 (రూ. 27,724)
కొలంబియా: $302 (రూ. 24,698)
బంగ్లాదేశ్: $255 (రూ. 20,854)
వెనిజులా: $179 (రూ. 14,639)
నైజీరియా: $160 (రూ. 13,085)
ఈజిప్ట్: $145 (రూ. 11,858)
పాకిస్థాన్: $145 (రూ. 11,858)

Published at : 03 May 2023 12:08 PM (IST) Tags: highest Paying countries average monthly salary Indian People Monthly Salary

సంబంధిత కథనాలు

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ -  కొనాలంటే ఇదే రైట్ టైం!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?