అన్వేషించండి

Petrol-Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గుతాయా, సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఆలోచన ఏంటి?

దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, పెట్రోల్ & డీజిల్ ధరలను తగ్గిస్తుందని సిటీ గ్రూప్‌ రిపోర్ట్‌ చెబుతోంది.

Petrol-Diesel Rates: దేశంలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఉపశమనం కలిగించింది, గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ రేటును (Domestic LPG Cylinder Price) 200 రూపాయలు తగ్గించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదార్లకు ఇప్పటికే రూ. 200 రాయితీ లభిస్తోంది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ తాజాగా అనౌన్స్‌ చేసిన రూ. 200 కన్సెషన్‌తో కలిపి, ఉజ్వల యోజన కింద వంట గ్యాస్‌ సిలిండర్‌ మీద రూ. 400 డిస్కౌంట్‌ దొరుకుతోంది. తగ్గిన ధర నిన్నటి (బుధవారం, 30 ఆగస్టు 2023) నుంచి అమల్లోకి వచ్చింది. 

మన దేశంలో, రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ (retail inflation‌) జులై నెలలో 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44%కి పెరిగింది. ద్రవ్యోల్బణం దెబ్బకు బెదిరిపోయిన కోట్లాది మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం కాస్తంత ధైర్యాన్ని, బతుకు మీద ఆశను పుట్టించింది. వంట గ్యాస్‌ కథ కంచికి చేరడంతో, ఇప్పుడు దేశంలో సామాన్య జనాల నుంచి నిపుణుల వరకు అందరి దృష్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరల మీదకు మళ్లింది. కేంద్ర ప్రభుత్వం చమురు రేట్లను కూడా తగ్గిస్తుందన్న చర్చ జరుగుతోంది.

ఫ్యూయల్‌ మీద ఫోకస్‌
సిటీ గ్రూప్‌ రిపోర్ట్‌ ప్రకారం, వంట గ్యాస్ రేట్లలో కోత దేశంలో ద్రవ్యోల్బణం తగ్గవచ్చు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఫోకస్‌ ఫ్యూయల్‌ మీద ఉండొచ్చు. ముఖ్యంగా, మన దేశంలో ఫెస్టివ్‌ సీజన్‌ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ప్రధాన పండుగలు ఉన్నాయి. అతి త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్‌, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు కూడా క్యూలో నిలబడి ఎదురు చూస్తున్నాయి. దీంతో, దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, పెట్రోల్ & డీజిల్ ధరలను తగ్గిస్తుందని సిటీ గ్రూప్‌ రిపోర్ట్‌ చెబుతోంది.

వంట గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం రేటు 30 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు దేశాన్ని దడదడలాడించిన టమాటా ధరలు కూడా ఇప్పుడు తగ్గాయి. దీంతో, ఆగస్టు నెల ద్రవ్యోల్బణం రేటు (సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు) 6 శాతానికి దిగువన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

ఆహార పదార్థాల ధరల తగ్గింపుపై దృష్టి
ఇటీవలి నెలల్లో, దేశంలో ఆహార పదార్థాల రేట్లు విపరీతంగా పెరిగాయి. అందువల్లే రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ రేటు అమాంతం పెరిగిపోతోంది. ఆహార ధరలను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్నాళ్లుగా.. బియ్యం, గోధుమలు, ఉల్లిపాయలు, ఇతర ధాన్యాల ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. తద్వారా, దేశీయ మార్కెట్‌లో సప్లై పెరిగి, అధిక ధరల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్‌
ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఐదు రాష్ట్రాల్లో (తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత 2024 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో, రాబోయే కాలంలో తన ఖజానా నుంచి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ఆ డబ్బులో కొంత వాటాను కేటాయించే అవకాశం ఉంది.

మరో ఆసక్తికర కథనం: పైచూపులోనే పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget