Two Wheelers: గ్రామీణ ప్రాంతాల్లో బైకుల విప్లవం - ఊహించని విధంగా పెరిగిన అమ్మకాలు- రైతుల ఆదాయం పెరిగిందా?
Buying Two Wheelers: గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని విధంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ప్రజల ఆదాయాలు పెరగడమేనని అంచనా వేస్తున్నారు.
Rural India Is Buying Two-Wheelers: గ్రామీణ భారత్‌లో రెండు చక్ర వాహనాల కొనుగోళ్లు ఎన్నడు లేనంతగా పెరగాయి. ద్విచక్ర మార్కెట్ వర్గాలను డిమండ్ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు ఆకాశాన్ని తాకినట్లుగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.96 కోట్ల యూనిట్ల టూ-వీలర్స్ కొనుగోళ్లు చేశారు. ఇది 9.1 శాతం వృద్ధితో సమానం. ఈ వృద్ధికి గ్రామీణ ఆదాయాల పెరుగుదల, మొదటి సారి కొనుగోళ్లు , పండుగల కొనుగోళ్లు m ప్రభుత్వ GST రేటు కోతలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ ట్రెండ్ 2026లో కూడా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో టూ-వీలర్స్ గ్రామీణ ఆర్థిక వృద్ధికి ప్రత్యక్ష సూచికగా పరిగణించవచ్చు. సాధారణ వర్షపాతం వల్ల రైతుల ఆదాయాలు మెరుగుపడటం, దీపావళి పండుగ సమయంలో రైతులకు చెల్లింపులు , వివాహాల సీజన్ వల్ల గ్రామీణ కొనుగోళ్లు గణనీయంగా పెరిగింది. హీరో మోటోకార్ప్ వంటి పెద్ద కంపెనీలు గ్రామీణ డిమాండ్ వల్ల 40 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి. అక్టోబర్ 2025లో మొత్తం టూ-వీలర్ విక్రయాలు రికార్డు 18.5 లక్షల యూనిట్లకు చేరాయి, ఇందులో గ్రామీణ ప్రాంతాల డిమాండ్ ఎక్కువ.
గ్రామీణ కొనుగోళ్లకు మరో ముఖ్య కారణం ప్రభుత్వం చేసిన GST రేటు కోతలు. ఈ కోతలు వాహనాలను సరసమైన ధరలకు అందించడంతో, మధ్య తరగతి కుటుంబాలు మరింత ఆకర్షితులయ్యాయి. ICRA రేటింగ్స్ ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో టూ-వీలర్ విక్రయాలు 6-9 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. ఇందులో గ్రామీణ ఆదాయాలు స్థిరంగా ఉండటం, మొదటి సారి కొనుగోళ్లు, రీప్లేస్‌మెంట్ డిమాండ్ కీలకమని నివేదికలు తెలిపాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా హై-కెపాసిటీ, ప్రీమియం మోడల్స్‌పై డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇవి దీర్ఘ దూరాల ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (SIAM) నివేదిక ప్రకారం, స్కూటర్ సెగ్మెంట్ గ్రామీణ, సెమీ-అర్బన్ కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు కొత్త మోడల్స్ అందుబాటులోకి రావడంతో ఈ వృద్ధికి దోహదపడింది.
కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ ఇంకా తక్కువగా ఉంది. దీనికి కారణం సర్వీస్, చార్జింగ్ వంటి ఇన్ ఫ్రా తక్కువగా ఉండటమేనని అంటున్నారు. అవి పెరిగుతున్నందున భవిష్యత్ లో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వస్తుందని అంచనా వేస్తున్నారు.
The Electric -2Wheeler industry is heading for a massive 10–15x expansion by 2035.
— The Investor Lens (@logical_traderr) November 21, 2025
Yep, you read that right. This isn’t a small trend. It’s a full structural shift—something India has seen only a handful of times in its two-wheeler history.
Because all the big triggers that… pic.twitter.com/qfzvFBgu08





















