అన్వేషించండి

Train Journey: టీటీఈతో మాట్లాడి టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా ఉండదా?

Train Journey Without A Ticket: ఎవరైనా టికెట్ కొనకుండా కేవలం TTEతో మాట్లాడి రైలు ఎక్కితే, అతను టిక్కెట్‌ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుందా?, ఫైన్‌ కట్టాల్సిన అవసరం లేదా?.

Indian Railways Rules: భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అంటారు. భారతదేశంలో ప్రతిరోజు కోట్ల మంది ప్రజలు వందలాది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎక్కువ దూరం ప్రయాణించవలసి వచ్చినప్పుడు, చాలా మంది ప్రజలు ట్రైన్‌ జర్నీని ఇష్టపడతారు. రైలులో ప్రయాణించడం హాబీగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. ప్రతిరోజూ కోట్ల మంది రైళ్లు ఎక్కి దిగుతుంటారు కాబట్టి, తోటి ప్రయాణీకులకు & రైల్వేకు ఇబ్బందులు/ నష్టం వంటి కలగకుండా ఉండేందుకు భారతీయ రైల్వే కొన్ని నియమాలను ఏర్పాటు చేసింది. ఈ నియమాల్లో ఒకటి "తప్పనిసరిగా టిక్కెట్‌ కొనుగోలు".

రైళ్లలో పెళ్లిళ్ల సీజన్‌ రద్దీ                   
టికెట్ లేకుండా ఏ రైలులోనూ ఎవరూ ప్రయాణించలేరు. ప్రస్తుతం, భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్‌  (Wedding season 2024) ప్రారంభమైంది. మరికొన్నాళ్ల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో సహజంగానే రైలు ప్రయాణాలు, రైళ్లలో రద్దీ, టిక్కెట్లకు డిమాండ్‌ పెరిగాయి. ప్రయాణ తేదీ దగ్గర పడుతున్నా చాలా మంది ప్రజలకు టిక్కెట్లు కన్ఫర్మ్ కావడం లేదు. ఈ నేపథ్యంలో, కొంతమంది టిక్కెట్టు కొనుక్కోకుండా, స్టేషన్‌లో ఉన్న TTE (Travelling Ticket Examiner)తో మాట్లాడి రైలు ఎక్కుతుంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు.. టిక్కెట్‌ కోసం అనవసరంగా హైరానా పడ్డాం, టీటీఈతో మాట్లాడి సీట్‌ కన్ఫర్మ్‌ చేసుకుంటే సరిపోయేది కదా అని మనకు కూడా అనిపిస్తుంది. అయితే... స్టేషన్‌లో ఉన్న టీటీఈతో మాట్లాడితే, టిక్కెట్‌ కొనకుండానే రైలు ఎక్కొచ్చా, ఈ విషయంలో రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి?.

టీటీఈతో మాట్లాడి టికెట్ లేకుండా ప్రయాణిస్తే...                   
అనుకోకుండా ప్రయాణాలు చేసేవాళ్లు, క్యూ లైన్‌లో నిలబడి టిక్కెట్‌ తీసుకునేంత సమయం లేని వాళ్లు లేదా బద్ధకించే వాళ్లు టికెట్ కొనకుండానే రైలు ఎక్కుతుంటారు. మన కళ్ల ముందే టీటీఈతో మాట్లాడి దర్జాగా రైలు ఎక్కి కూర్చుంటారు. రైల్వే రూల్‌ ప్రకారం అలాంటి ప్రయాణీకులకు జరిమానా కట్టాలి. టీటీఈతో మాట్లాడినప్పటికీ టిక్కెట్టు కొనుక్కోకుండా రైలులో ప్రయాణిస్తున్నారు కాబట్టి, టిక్కెట్‌ ధరతో పాటు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. టీటీఈతో మాట్లాడినప్పటికీ, ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రదేశం నుంచి రైలు గమ్యస్థానం వరకు పూర్తి ఛార్జీని చెల్లించాలి. దీనికి అదనంగా జరిమానా కోసం రూ. 250 కట్టాలి.

సీటు సంపాదించొచ్చు        
టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసే సమయంలో టీటీఈకి టిక్కెట్‌ ధర + జరిమానా కట్టిన తర్వాత మీరు మీ ప్రయాణాన్ని ఎలాంటి టెన్షన్‌ లేకుండా కొనసాగించవచ్చు. దీంతో పాటు, రైలులో ఎక్కడైనా సీటు ఖాళీగా ఉంటే, టీటీఈ మీకు ఆ సీటు కేటాయించవచ్చు. ఒకవేళ టీటీఈ మీకు సీటు ఇవ్వకపోతే, సీటు గురించి అతనిని అడగవచ్చు.

మరో ఆసక్తికర కథనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ అంటే ఏంటి, విలువను ఎలా నిర్ణయిస్తారు? 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget