News
News
X

Vedanta, Foxconn: త్వరలో చిప్‌ సమస్యకు చెక్‌ - ₹1.54 లక్షల కోట్లతో గుజరాత్‌లో ఉత్పత్తి ఫ్లాంట్‌

ఒక్క వాహన రంగానే కాదు, స్మార్ట్‌ ఫోన్లు, ఏటీఎం కార్డులు సహా మొత్తం ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు ఈ చిప్‌ అత్యంత కీలక విడిభాగం.

FOLLOW US: 

Vedanta, Foxconn: ప్రపంచ వాహన రంగం మీదకు కరోనా తెచ్చిన అనర్థాల్లో చిప్‌ లేదా సెమీకండక్టర్‌ కొరత ఒకటి. కరోనా వల్ల తైవాన్‌, దక్షిణ కొరియా వంటి చిప్‌ తయారీ దేశాల్లో ఫ్లాంట్లు మూతబడి, సరఫరా ఆగిపోయింది. ఆధునిక వాహనాల తయారీలో చిప్‌లు అత్యంత కీలకం. డోర్‌ లాక్‌ నుంచి డ్రైవింగ్‌ వరకు ప్రతి అడుగులోనూ ఇవి ఉంటాయి. కేవలం చిప్‌లు లేవన్న కారణంతోనే మన దేశంలోనూ పెద్ద కంపెనీలన్నీ వాటి ఉత్పత్తిని బాగా తగ్గించాయి. కొన్ని కంపెనీలు వారాల తరబడి ఫ్లాంట్లను మూసేశాయి. ఉత్పత్తి ఆగిపోవడంతో, డెలివరీల కోసం (లైట్‌ వెహికల్‌ నుంచి హెవీ వెహికల్‌ వరకు) కస్టమర్లు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా, కార్ల విషయంలో పరిస్థితి ఘోరంగా ఉంది.

ఒక్క వాహన రంగానే కాదు, స్మార్ట్‌ ఫోన్లు, ఏటీఎం కార్డులు సహా మొత్తం ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు ఈ చిప్‌ అత్యంత కీలక విడిభాగం. అత్యంత చిన్నగా ఉండే ఈ చిప్‌, అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ పరికరంతో స్మార్ట్ వర్క్‌ చేయిస్తుంది. 

ఇంతటి కీలకమైన చిప్‌/సెమీకండక్టర్‌ల తయారీ ఫ్లాంటును మన దేశంలో నెలకొల్పేందుకు మైనింగ్ దిగ్గజం వేదాంత (Vedanta), తైవాన్‌కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ (Foxconn) చేతులు కలిపాయి. ఈ డీల్‌ పాతదే అయినా, తాజాగా దీనికి తొలి అడుగు పడింది.

₹1.54 లక్షల కోట్ల పెట్టుబడి
డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ & సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు వేదాంత, ఫాక్స్‌కాన్‌ మంగళవారం సంతకాలు చేశాయి. మొత్తం పెట్టుబడి ₹1.54 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో, ₹94,500 కోట్లను డిస్‌ప్లే తయారీ యూనిట్‌ కోసం; ₹60,000 కోట్లను సెమీకండక్టర్‌ తయారీ ప్లాంటు కోసం పెట్టుబడిగా ఉపయోగిస్తారు.

దేశంలో చిప్ తయారీ సామర్థ్యాన్ని వృద్ధి చేయడానికి కేంద్రం ప్రకటించిన ₹76,000 కోట్ల ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం (PLI) పథకం కింద ప్రణాళికలను ప్రకటించిన నాలుగో కంపెనీగా ఈ జాయింట్ వెంచర్‌ (JV) నిలిచింది.

రెండేళ్లలో ఉత్పత్తి
ఈ జాయింట్ వెంచర్‌లో వేదాంతకు 60% వాటా, ఫాక్స్‌కాన్‌కు 40% వాటా ఉంటుంది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఈ ఫ్లాంటు వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి రానుంది. అంటే, రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 28 నానోమీటర్ల (nm) టెక్నాలజీ నోడ్‌లపై పనిచేస్తుంది. వేదాంత-ఫాక్స్‌కాన్ యూనిట్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జనరేషన్-8 డిస్‌ప్లేలను ఉత్పత్తి చేస్తుంది. తొలుత, నెలకు 40,000 వేఫర్లు, 60,000 ప్యానెళ్లను తయారు చేస్తామని వేదాంత గ్రూప్‌ ప్రకటించింది.

ఇతర రాష్ట్రాల్లోనూ..
కర్ణాటక, తమిళనాడులోనూ సెమీకండక్టర్, డిస్‌ప్లే యూనిట్లు రాబోతున్నాయి. కర్ణాటకలో ఐఎస్‌ఎంసీ అనలాగ్ (ISMC Analog), తమిళనాడులో ఐజీఎస్ఎస్‌ వెంచర్స్ (IGSS Ventures) ద్వారా ఏర్పాటు కానున్నాయి. బెంగళూరుకు చెందిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (Rajesh Exports) తెలంగాణలో ఫ్యాబ్ డిస్‌ప్లే యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గతంలో ప్రకటించింది.

భారతదేశ సెమీకండక్టర్‌ మార్కెట్‌ విలువ 2021లో 27.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2026 నాటికి ఇది దాదాపు 3 రెట్లు పెరుగుతుందని, 64 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి.

Published at : 14 Sep 2022 10:17 AM (IST) Tags: chip Gujarat Vedanta Foxconn semiconductor

సంబంధిత కథనాలు

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

Gold-Silver Price 29 September 2022: బంగారం లాంటి అవకాశం, 50 వేలకు దిగువనే పసిడి ధర

Gold-Silver Price 29 September 2022: బంగారం లాంటి అవకాశం, 50 వేలకు దిగువనే పసిడి ధర

RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

టాప్ స్టోరీస్

TRS MP Santosh Issue : ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ - అసలేం జరిగిందంటే ?

TRS MP Santosh Issue :  ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ -  అసలేం జరిగిందంటే ?

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!