అన్వేషించండి

No Demand For Cars : షోరూంలలోనే మిగిలిపోతున్న స్టాక్స్ - దేశంలో కార్లకు డిమాండ్ తగ్గిపోయిందా ?

Car Sales : కార్ల అమ్మకాలు తగ్గిపోవడంతో వివిధ కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. మరో వైపు డీలర్ల వద్ద కార్ల స్టాక్ అంతకంతకూ పెరిగిపోతోంది.

No Demand For Cars In  India : నిన్నామొన్నటి వరకూ ఏదైనా కారు కొనాలంటే మోడల్ ను బట్టి వెయిటింగ్ లిస్టు ఉండేది. కానీ ఇప్పుడు చాలా మోడల్స్ కార్లను ఇలా డబ్బులు తీసుకెళ్లి అలా డ్రైవ్ చేసుకుంటూ తీసుకు వచ్చేయవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా డీలర్ల దగ్గర కార్లు పేరుకుపోతున్నాయి. స్టాక్ వస్తోంది కానీ.. ఉన్న స్టాక్ క్లియర్ కావడం లేదు. ఇప్పటికే దాదాపుగా ఏడున్నర లక్షలకుపైగా కార్లు డీలర్ల వద్ద ఉన్నట్లుగా చెబుతున్నారు. 

ఉత్పత్తిని తగ్గించిన మారుతీ సుజుకి

భారత్‌లో కార్ మార్కెట్‌లో నలభై శాతం మారుతీ సుజుకీ కంపెనీదే. ఈ కంపెనీ మొత్తం కార్ల ఉత్పత్తి సామర్థ్యం 4,96, 000. కానీ ఇప్పుడు సామర్థ్యంలో 70 శాతం కూడా ఉత్పత్తి చేయడం లేదు. దీనికి కారణం డీలర్ల వద్ద కార్లు పేరుకుపోవడంతో పాటు అమ్మకాలు ఉత్సాహంగా లేకపోవడం కూడా ఓ కారణం. అదనపు స్టాక్ వద్దని డీలర్లు చెబుతూండటంతో  ఉత్పత్తిని  తగ్గించారు.                

వీసా పాస్‌పోర్టు చోరీ చేసిన ఉద్యోగి - తిరిగిచ్చేయాలని బతిమాలుతున్న బాస్ ! ఇదో విచిత్రమైన కథ

కార్ల డిమాండ్ ఊహించిన దాని కంటే తక్కువ

ఈ ఏడాది ఎన్నికల కారణంగా కార్లకు ఉన్న డిమాండ్ తగ్గుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. కానీ  వారి అంచనాలకు మించి డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్న  కార్లను  అమ్మడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఇంత పెద్ద  సంఖ్యలో డీలర్ల వద్ద వాహనాలు పేరుకుపోవడం ఇటీవల సంవత్సరాల్లో ఇదే మొదటి సారి.   ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి కారణాలవల్ల కార్ల అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేశారు కానీ పరిస్థితి తారుమారయింది.                                   

ఐటీ రిటర్న్‌ ఫైల్ చేసిన తర్వాత సెక్షన్ 143 (1) కింద నోటీస్‌ వచ్చిందా?, ఇలా రిప్లై ఇవ్వండి

పండగ సీజన్‌పై ఆశలు పెట్టుకుంటున్న కంపెనీలు

భారత్ లో పండగ సీజన్ ప్రారంభమవుతోంది. వచ్చే నెల నుంచి వినాయక చవితి , దసరా, దీపావళి, సంక్రాంతి వరకూ వరుసగా పండగలు ఉన్నాయి. మన దేశంలో కార్ల లాంటి వస్తువులు కొనాలంటే మంచి రోజులు చూసుకుంటారు. ముఖ్యంగా పండగలను చూసుకుంటారు. అందుకే కార్ల కంపెనీలు .. పండుగలపై ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటి వరకూ కొరత ఉన్న డిమాండ్ ను  పండుగలు తీర్చేస్తాయని.షోరూంల వద్ద ఉన్న స్టాక్ క్లియర్ అయిపోతుందని ఆసిస్తున్నారు. పండుగల సీజన్ లోనూ కార్ల అమ్మకాలు పెరగకపోతే.. ఆటోమోబైల్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి రావచ్చని నిపుణులు అంచనా  వేస్తున్నారు.                                      

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
Revanth Reddy : బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Srisailam Temple : శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
Budget 2025: పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan Gokulam Concept | పాడిరైతుల జీవితాలను మార్చే గోకులాలు | ABP DesamKTR Quash Petition Supreme Court | కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ | ABP DesamSandeep Reddy Vanga Kite Flying | సంక్రాంతి  సెలబ్రేషన్స్ గట్టిగా చేసిన సందీప్ రెడ్డి వంగా | ABP DesamMahakumbh 2025 Day 2 | హెలికాఫ్టర్లతో భక్తులపై పూలవర్షం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
Revanth Reddy : బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Srisailam Temple : శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
Budget 2025: పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్.. బెడ్ రెస్ట్ కు గురైన భారత స్టార్ ప్లేయర్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్.. బెడ్ రెస్ట్ కు గురైన భారత స్టార్ ప్లేయర్
Nara Lokesh: లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Bhopal Constable : కనిపించకుండా పోయిన కరోడ్ పతి కానిస్టేబుల్.. కనిపించని డైరీ.. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కలకలం
కనిపించకుండా పోయిన కరోడ్ పతి కానిస్టేబుల్.. కనిపించని డైరీ.. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కలకలం
KTR News: రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
Embed widget