CEO Passport : వీసా పాస్‌పోర్టు చోరీ చేసిన ఉద్యోగి - తిరిగిచ్చేయాలని బతిమాలుతున్న బాస్ ! ఇదో విచిత్రమైన కథ
Bengaluru CEO : మాస్ లే ఆఫ్స్ ను ప్రకటించిన సీఈవోకు సీనియర్ ఉద్యోగి షాకిచ్చారు. ఆ సీఈవో పాస్ పోర్టు, వీసాను తీసుకెళ్లిపోయాడు.దాంతో ఆ సీఈవో ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు.
![CEO Passport : వీసా పాస్‌పోర్టు చోరీ చేసిన ఉద్యోగి - తిరిగిచ్చేయాలని బతిమాలుతున్న బాస్ ! ఇదో విచిత్రమైన కథ Ex Employee Stole Bengaluru CEO Passport With US Visa After Mass Layoffs CEO Passport : వీసా పాస్‌పోర్టు చోరీ చేసిన ఉద్యోగి - తిరిగిచ్చేయాలని బతిమాలుతున్న బాస్ ! ఇదో విచిత్రమైన కథ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/16/ef20f32a314c9ff8215a92f3da072f1e1723824748790228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ex Employee Stole Bengaluru CEO Passport With US Visa : ఆ కంపెనీ సీఈవో అమెరికాకు వెళ్లి తన కంపెనీకి అదనపు పెట్టుబడుల కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నారు. కానీ ఆయన పాస్ పోర్ట్, వీసా మాత్రం కనిపించడం లేదు. వెదికి వెదికి చివరికి ఆయనకు తెలిసిందేమిటంటే కంపెనీలో పని చేసిన ఉద్యోగి వాటిని తస్కరించాడని. ఇప్పుడు ఆయనను పిలిచి పాస్ పోస్ట్, వీసా తీసుకు రావాలని అడగలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఉద్యోగిని అంతకు ముందే ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతో కోపం వచ్చి ఆ వీసా పాస్ పోర్టు తీసుకెళ్లిపోయారు. ఆలస్యంగా విషయం తెలిసిన తర్వాత సీఈవోకు నిద్ర కరువైంది.
AI స్టార్టప్ ప్రారంభించి ఉద్యోగుల్ని తీసేసిన విశ్వనాథ్
బెంగళూరులో సార్తీ AI అనే స్టార్టప్ కంపెనీని విశ్వనాథ్ ఝా ప్రారంభించారు. ఫౌండర్ సీఈవో ఆయనే. ఆయన భారీగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుని పనులు చేశారు. అయితే నష్టాలు వస్తున్నాయి. దీంతో కంపెనీని లాభాల బాటలో ఉంచడానికి పెద్ద ఎత్తున లే ఆఫ్స్ ప్రకటించారు. వర్క్ ఫోర్స్ లో సగానికిపైగా ఉద్యోగుల్ని తీసేశారు. ఆ సమయంలోనే సీనియర్ ఉద్యోగి ఒకరు వీసా, పాస్ పోర్టు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు తన కంపెనీకి పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే వీసా వచ్చింది. కానీ వీసా, పాస్ పోర్టు రెండూ పోవడంతో ఆయనకు మరో దారి లేకుండా పోయింది.
వీసా కూడా తీసుకెళ్లడంతో అమెరికా వెళ్లలేని పరిస్థితి
పోయిందని చెప్పి పాస్ పోర్టును కొత్తది పొందిన వీసా తీసుకోవడం మాత్రం ఆయనకు సాధ్యం కావడం లేదు. భారీ క్యూ ఉండటమే దీనికి కారణమని ఆయన చెబుతున్నారు. తాను మాస్ లే ఆఫ్స్ ప్రకటించింది ఇన్వెస్టర్ల ఒత్తిడి మేరకేనని.. ఉద్యోగులకు కీడు చేయాలని కాదని ఆయన ఓ ఇంటర్యూలో వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం.. ఝాపై చాలా ఆరోపణలు చేశారు. తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదని.. తమతో చెడుగా ప్రవర్తించేవారని ఆరోపిస్తూ వచ్చారు. యాభై మంది ఉద్యోగులకు ఏడాది వరకూ జీతాలు ఇవ్వలేదని వారంటున్నారు. న్యాయపరమైన చర్యలు తీసుకున్నా.. లీగల్ నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించడం లేదంటున్నారు.
విశ్వనాథ్‌పై ఉద్యోగుల తీవ్ర ఆరోపణలు
గత రెండేళ్ల నుంచి ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఉద్యోగుల టీడీఎస్‌ను కట్టలేదన్న ఆరోపణలను కూడా సీఈవో విశ్వనాథ్ అంగీకరించారు. కంపనీకి చాలా సవాళ్లు ఉన్నాయని వాటన్నింటినీ అధిగమిస్తామని ఆయన అంటున్నారు. ఈ ఏడాదిలో కొత్త పెట్టుబడులు వస్తాయని.. కంపెనీ నడుపుకుంటానని ఆయన ఆశాభవంతో ఉన్నారు. ఆయన ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే.. తన వీసా పత్రాలు తనకు ఇవ్వాలని కోరడానికే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)