Senior Citizen FD Rates: సీనియర్ సిటిజన్లకు మంచి అవకాశం - ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద 8.30% వడ్డీ ఆదాయం
చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ 8 శాతం పైకి చేరింది. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 9 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి.
Senior Citizen FD Rates: ఈ సంవత్సరం (2022), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 2 శాతం పెంచింది. దీనిని అనసురిస్తూ చాలా బ్యాంకులు, NBFCలు తాము ఇచ్చే రుణాల మీద & స్వీకరించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDలు) మీద వడ్డీని పెంచాయి. రేటు పెంపు తర్వాత, చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ 8 శాతం పైకి చేరింది. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 9 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి.
ఒకవేళ మీరు కూడా మీ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ మార్గంలో పెట్టుబడిగా పెట్టాలని ప్లాన్ చేస్తుంటే... మీకు ఉపయోగపడే సమాచారం మేం అందిస్తాం. కొన్ని బ్యాంకులు FDల మీద 8.30 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. అయితే, ఈ అధిక వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లు అందరికీ వర్తించదు. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవి:
ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL Bank)
60 ఏళ్లు పైబడిన - 80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద, సాధారణ పౌరుల కంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని RBL బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక, 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 75 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని ఈ బ్యాంక్ ఇస్తోంది. అంటే, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.3 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ రేటు నవంబర్ 25, 2022 నుంచి అమలులోకి వచ్చింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)
ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 0.50 శాతం వడ్డీ ఇస్తుండగా, సూపర్ సీనియర్ సిటిజన్లకు ప్రతి సంవత్సరం 0.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది. యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, నవంబర్ 25న వడ్డీ రేటు పెరిగిన తర్వాత, 800 రోజుల నుంచి 3 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 8.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం... రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు చేసిన సీనియర్ సిటిజన్లకు, సాధారణ FD రేటు కంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని ఇస్తున్నారు. సూపర్ సీనియర్ సిటిజన్లకు, సాధారణ FD రేటు కంటే 80 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీని అందిస్తున్నారు. 666 రోజుల కాల పరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.10 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఈ వడ్డీ రేటు 12 డిసెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చింది.
ఇండియన్ బ్యాంక్ (Indian Bank)
ఇండియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం... స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద, 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు FDల మీద అదనంగా 0.25 శాతం వడ్డీని ఈ బ్యాంక్ ఇస్తోంది.