Union Cabinet LIC : ఎల్‌ఐసీలో 20 శాతం విదేశీ పెట్టుబడిదారులకు చాన్స్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం !
ఐపీవోకి రాబోతున్న ఎల్‌ఐసీలో 20 శాతం విదేశీ పెట్టుబడిదారులకు ఆటోమేటిక్ రూట్‌లో అవకాశం కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్మయించినట్లుగా తెలుస్తోంది.
పబ్లిష్ ఇష్యూకి రాబోతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ( LIC IPO ) 20 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ( FDI ) అనుమతించే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ( Central Cabinet ) అనుమతించినట్లుగా తెలుస్తోంది. దీని వలన రాబోయే ఎల్‌ఐసి ఐపిఓలో పాల్గొనడానికి విదేశీ పెట్టుబడిదారులకు మార్గం సుగమం అవుతుంది. కేంద్ర మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కార్గిల్‌నే చూశాం బ్రదర్! రష్యా యుద్ధానికి భయమేల - ఇన్వెస్టర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఎల్‌ఐసిలో ( LIC ) ఎఫ్‌డిఐ కోసం కన్సాలిడేటెడ్ ఎఫ్‌డిఐ పాలసీలో ప్రత్యేక నిబంధనను పొందుపరచవచ్చని ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భారతదేశం బీమా రంగంలో ( Insurence Sector ) 74 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుంది. అయితే ఇది ఎల్‌ఐసీకి మాత్రం వర్తించదు. ఎందుకంటే ఎల్‌ఐసీకి ప్రత్యేకమైన చట్టం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ( Public Sector Banks ) ఎఫ్‌డిఐ సీలింగ్ ఆమోదం 20 శాతం ఉన్నందున ఎల్‌ఐసిలో ఎఫ్‌డిఐకి కూడా ఇదే పరిమితిని అనుమతించవచ్చని కేంద్రం నిర్ణయించింది.
మార్చి 31లోపు Home Loan పొందండి - లేదంటే రూ.3.5 లక్షల పన్ను మినహాయింపు కోల్పోతారు
మూల ధన సమీకరణ ప్రక్రియ వేగవంతం కావడానికి, ఎల్‌ఐసిలో ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ ( Automatic Route ) మార్గంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జారీ చేసిన ప్రస్తుత విదేశీ పెట్టుబడుల పాలసీ ప్రకారం విదేశీ పెట్టుబడులను బీమా కంపెనీల్లోకి అనుమతిస్తారు. వచ్చే నెలలో ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీలో కంపెనీలో వాటా విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నందున ఎఫ్‌డీఐని అనుమతించడం కీలక పరిణామంగా మారింది.
ఈ ఇష్యూ ( Public Issue ) ద్వారా కనీసం లక్ష కోట్ల రూపాయలు సమీకరించాలన్నది మోడీ ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే ఐపీఓ కోసం అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు కూడా ఎల్‌ఐసీ ఐపీవోలో షేర్ల కోసం పోటీపడితే పెద్ద ఎత్తున పోటీ పెరిగి షేర్ ధర అమాంతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారులకు భారత్ హాట్ ఫేవరేట్‌గా ఉంది. పైగా ఎల్‌ఐసీ అత్యంత విజయవంతమైన భారతీయ కంపెనీల్లో ఒకటి.