Elon Musk on Twitter: ఆటాడుతున్నాడా? ట్విటర్ కొనుగోలు నిలిపేశానంటూ ఎలన్ మస్క్ ట్వీట్!
Elon Musk on Twitter: టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నానని ప్రకటించారు.
Twitter deal temporarily on hold, pending details supporting calculation of fake accounts Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నానని ప్రకటించారు. స్పామ్, ఫేక్ అకౌంట్ల వివరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నానని ప్రకటించారు. స్పామ్, ఫేక్ అకౌంట్ల వివరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
'ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేశాను. స్పామ్, ఫేక్ అకౌంట్లు మొత్తం యూజర్లలో 5 శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు నిరూపించే లెక్కలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి' అని మస్క్ ట్వీట్ చేశారు. దాంతో ఈ సోషల్ మీడియా కంపెనీ షేర్ల ధర ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 17 శాతం పతనం అయ్యాయి.
ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ఎలన్ మస్క్ గతంలో ప్రకటించారు. ఆ కంపెనీని కైవసం చేసుకొనేందుకు ఆయనకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాంతో వారం రోజులుగా టెస్లా, ట్విటర్ షేర్లు భారీగా పతనం అవుతూనే ఉన్నాయి. టెస్లా షేర్లైతే మరీ ఘోరంగా పడిపోయాయి. ఈ వారంలోనే 16 శాతం పతనం కావడంతో షేరు ధర 728 డాలర్లకు చేరుకుంది. ఇక ట్విటర్ షేర్లు ఈ వారంలో 9.5 శాతం పడిపోయి 45.08 డాలర్లకు పరిమితమైంది. ఎస్ అండ్ పీ 500తో పోలిస్తే ఈ వారం ఈ రెండు కంపెనీల షేర్లే ఎక్కువ పతనం అయ్యాయి.
Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn
— Elon Musk (@elonmusk) May 13, 2022
If Twitter acquisition completes, company will be super focused on hardcore software engineering, design, infosec & server hardware https://t.co/m2HseK0TXl
— Elon Musk (@elonmusk) May 6, 2022
Since I’ve been asked a lot:
— Elon Musk (@elonmusk) May 1, 2022
Buy stock in several companies that make products & services that *you* believe in.
Only sell if you think their products & services are trending worse. Don’t panic when the market does.
This will serve you well in the long-term.