Train Ticket: కన్ఫర్మ్‌డ్ ట్రైన్ టిక్కెట్ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్ ప్రయత్నించండి
తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టి, కన్ఫర్మ్‌డ్ టిక్కెట్ పొందే మార్గం ఒకటి ఉంది.
Confirm Train Ticket: మన దేశంలో ప్రతి రోజూ కోట్లాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. టిక్కెట్ ఉన్న వాళ్లలో కొందరు ఆ టిక్కెట్‌ను చాలా కాలం ముందే బుక్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే, వాళ్ల ప్రయాణ తేదీ చాలా ముందుగానే వాళ్లకు తెలిసి ఉంటుంది. అందువల్ల, ముందస్తుగానే సులభంగా టిక్కెట్ బుక్ చేసుకుని, కన్ఫర్మ్ చేసుకుంటారు.
మరికొందరికి చాలా అత్యవసర ప్రయాణం పడుతుంది. ఆఫీస్ ట్రిప్పులైనా, మరేదైనా సమస్య అయినా.. ఒక్కరోజులో వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, చివరి నిమిషంలో ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ, రైలు టిక్కెట్ అంత తేలిగ్గా దొరకదు. తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టి, కన్ఫర్మ్‌డ్ టిక్కెట్ పొందే మార్గం ఒకటి ఉంది.
కన్ఫర్మ్ టిక్కెట్ యాప్
ట్రైన్ టిక్కెట్ పొందడంలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా, కన్ఫర్మ్‌డ్ టికెట్ పొందేలా ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక సర్వీస్ తీసుకొచ్చింది. ఆ సర్వీస్ పేరు కూడా కన్ఫర్మ్‌టికెట్ (Confirmtkt). ఈ వెబ్‌సైట్ నుంచి కన్ఫర్మ్‌డ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. Confirmtkt పేరుతోనే యాప్ కూడా ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్, హిందీ సహా చాలా ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్/పోర్టల్‌లోకి వెళ్లాక.. ఖాలీ సీట్ల వివరాల కోసం ప్రతి ట్రైన్ స్టేటస్‌ను తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి శోధిస్తే, ఆ మార్గంలో వెళ్లే రైళ్లలో అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలన్నీ ఒకేసారి కళ్ల ముందు కనిపిస్తాయి. అక్కడ టికెట్ దొరక్కపోతే, కొంత అదనపు డబ్బు చెల్లించి టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ టిక్కెట్లను బుక్ చేయడానికి IRCTC లాగిన్ ID అవసరం.
తత్కాల్, ప్రీమియం తత్కాల్
తత్కాల్‌లో... AC క్లాస్ టికెట్ కోసం ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ కోసం 11 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు మాత్రమే ఈ పద్ధతిలో బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ కూడా ఉపయోగపడుతుంది. అయితే, దీని కోసం చాలా ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రైలులో సీట్లు నిండిపోయేకొద్దీ ప్రీమియం టికెట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇది, ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ విధానం లాంటిది.
మేక్‌మైట్రిప్ ట్రిప్ గ్యారెంటీ ప్రోగ్రామ్ (MakeMyTrip launches ‘Trip Guarantee’)
కన్ఫర్మ్‌డ్ టికెట్ బుకింగ్ కోసం.. మేక్ మై ట్రిప్ సంస్థ ట్రిప్ గ్యారెంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. రైలు రన్నింగ్‌లో ఉన్నప్పుడే, ప్రయాణికులు 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ల నుంచి కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీరు గమ్యస్థాన స్టేషన్ సమీపంలోని స్టేషన్‌లో కూడా దిగవచ్చు. చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే కంపెనీ ఫుల్ రిఫండ్ వస్తుంది. రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, ఫ్లైట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది కాకుండా, క్యాబ్, బస్ ఆప్షన్లు కూడా ఈ గ్యారెంటీ ప్రోగ్రామ్‌లో కనిపిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! - ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్