Year Ender 2024: స్వయం శక్తితో ఎదిగిన ఇండియన్ సూపర్‌మ్యాన్‌లు - టాప్ 10లో ఎవరున్నారంటే?
Look Back Business 2024: స్వయం శక్తితో ఎదిగిన వ్యవస్థాపకులు స్థాపించిన బిలియన్ డాలర్ల విలువైన కంపెనీల సంఖ్య ఈ ఏడాది 15% పెరిగింది. మొత్తం 121 కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
Hurun India's Top Self-Made Entrepreneurs 2024: కుటుంబ వారసత్వంతో బడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన ముకేష్ అంబానీ లాంటి వాళ్లు ఉన్న మన దేశంలో, స్వయం శక్తితో వ్యవస్థాపకులుగా మారి స్ఫూర్తినిస్తున్న కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ల పేర్లతో తాజాగా ఒక జాబితా విడుదలైంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్ & హురున్ ఇండియా కలిసి "ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ & హురున్ ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఆంట్రపెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియం 2024" (HDFC FIRST Private & Hurun India's Top 200 Self-Made Entrepreneurs of the Millennium 2024) లిస్ట్ రెండో ఎడిషన్‌ను విడుదల చేశాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ, రూ. 3.4 లక్షల కోట్లకు పైగా సంపదతో (Radhakishan Damani net worth) అగ్రస్థానంలో నిలిచారు. ఫస్ట్ ఎడిషన్ (2023)తో పోలిస్తే, ఈ ఏడాది దమానీ ఆస్తుల విలువ 44 శాతం పెరిగింది.
2000 సంవత్సరం తర్వాత కంపెనీలు స్థాపించి, భారతదేశ వ్యాపార రంగాన్ని గణనీయంగా మార్చిన వ్యవస్థాపకులను ఈ జాబితాలోకి తీసుకున్నారు.
స్వయం శక్తితో వ్యవస్థాపకులుగా ఫేమస్ అయినవాళ్లు - టాప్ 10 లిస్ట్
1. రాధాకిషన్ దమాని (అవెన్యూ సూపర్‌మార్ట్స్-డీమార్ట్)
2. దీపిందర్ గోయల్ (జొమాటో)
3. శ్రీహర్ష మెజెటి & నందన్ రెడ్డి (స్విగ్గీ)
4. దీప్ కల్రా & రాజేష్ మాగో (మేక్‌మైట్రిప్)
5. అభయ్ సోయి (మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్)
6. యాశిష్ దహియా & అలోక్ బన్సాల్ (పాలసీ బజార్)
7. భవిత్ షేత్ & హర్ష్ జైన్ (డ్రీమ్11)
8. నితిన్ కామత్ & నిఖిల్ కామత్ (జీరోధ)
9. హర్షిల్ మాథుర్ & శశాంక్ కుమార్ (రేజర్‌పే)
10. ఫల్గుణి నాయర్ (నైకా)
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్ & హురున్ ఇండియా నివేదిక ప్రకారం... 56 కొత్త వ్యవస్థాపకులు & 32 కొత్త కంపెనీలు "టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఆంట్రపెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియం 2024" లిస్ట్‌లో యాడ్ అయ్యాయి. గత సంవత్సరం ఈ లిస్ట్‌లో ఉన్న 32 మంది ఈ ఏడాది డ్రాపౌట్ అయ్యారు. సెల్ఫ్-మేడ్ ఆంట్రపెన్యూర్స్ నెలకొల్పిన బిలియన్ డాలర్ల విలువైన కంపెనీల సంఖ్య ఈ సంవత్సరం 15 శాతం పెరిగింది. ఇప్పుడు, మొత్తం 121 కంపెనీలు రెండో ఎడిషన్‌లో చేరాయి. అంతేకాదు, ఈ జాబితాలోని ముగ్గురు వ్యక్తుల్లో, ఒక్కొక్కరి నికర విలువ (Net worth) 1 లక్ష కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువగా నమోదైంది. గత సంవత్సరం (2023) లిస్ట్‌లో, రూ.లక్ష కోట్ల మార్క్ దాటిన వ్యవస్థాపకులు ఇద్దరే.
ఈ సంవత్సరం విడుదలైన లిస్ట్ భారతదేశంలోని వ్యవస్థాపకత బలాన్ని ప్రతిబింబిస్తుంది. పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ వ్యక్తులు భిన్నమైన ఆవిష్కరణలతో ఆధునిక పరిష్కారాలను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు, సంప్రదాయ పద్థతులను చరిత్రలో కలిపారు. తాము ఎదుగడమే కాదు, ఉపాధిని సృష్టించి సమాజానికి తిరిగి ఇచ్చారు, దేశ ఆర్థిక పురోగతికి గణనీయంగా దోహదపడ్డారు.
గత ఏడాదితో పోలిస్తే, "ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ & హురున్ ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఆంట్రపెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియం 2024" లిస్ట్‌లోకి అడుగు పెట్టిన వాళ్ల సంపద పరిమితి ఈ ఏడాది 13 శాతం పెరిగింది, రూ. 3,400 కోట్లకు చేరుకుంది.
మరో ఆసక్తికర కథనం: ఇలాంటి ఫైనాన్షియల్ ప్లాన్‌తో కొత్త సంవత్సరం ప్రారంభించండి - ఏడాదంతా మీకు తిరుగుండదు!