అన్వేషించండి

Modi On Gautam Adani: అదానీ లంచం కేసు గురించి మోదీని అడిగితే ఎంత తెలివిగా సమాధానం చెప్పారో తెలుసా?

Adani Bribery Case: అమెరికా పర్యటనలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం తర్వాత భారత ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ అదానీ లంచం కేసు గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

PM Modi Gautam Adani Bribery Case: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన (Modi visit to the US) సమయంలో, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ & అతని కంపెనీపై లంచం ఆరోపణల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (US President Donald Trump)తో ఏదైనా చర్చ జరిగిందా అని భారత ప్రధాని మోదీని జర్నలిస్ట్‌లు అడిగినప్పుడు, మోదీ చాలా తెలివిగా సమాధానం చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం తర్వాత ప్రధాని మోదీ సమావేశం ‍‌(Prime Minister Modi - Donald Trump Talks) తర్వాత, ఇరువురు నేతలు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు, గౌతమ్ అదానీ లంచం కేసు గురించి అధ్యక్షుడు ట్రంప్‌తో ఏదైనా చర్చ జరిగిందా అని ఒక జర్నలిస్ట్‌ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, "భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. వసుదైక కుటుంబం మన సంస్కృతి. మనం మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిస్తాం. ప్రతి భారతీయుడు నా వాడని నేను నమ్ముతున్నాను" అని చెప్పిన మోదీ, రెండు దేశాల అగ్ర నాయకులు కలిసినప్పుడు అలాంటి వ్యక్తిగత విషయాలను (గౌతమ్‌ అదానీ లంచం కేసు గురించి) ఎప్పుడూ చర్చించరు అని అన్నారు.

రూ. 2,100 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు
2024 నవంబర్‌లో, అమెరికాలో సౌరశక్తి కాంట్రాక్టులు (Solar energy contracts) పొందేందుకు సంబంధించి గౌతమ్ అదానీ సహా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Limited) డైరెక్టర్లపై రూ. 2,100 కోట్ల లంచం ఆరోపణలు వచ్చాయి. లంచం ఇచ్చిన ఆరోపణలపై అమెరికన్ కోర్టులో విచారణ జరిగింది. గౌతమ్ అదానీ & అదానీ గ్రీన్‌ ఎనర్జీ అధికారులపై ఈ ఆరోపణలు వచ్చినప్పుడు, అమెరికాలో జో బైడెన్ ‍‌(Joe Biden) ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవల తన ఉత్తర్వు ద్వారా. గౌతమ్ అదానీపై ఈ ఆరోపణలు చేసిన 50 ఏళ్ల నాటి న్యాయ శాఖ చట్టాన్ని రద్దు చేశారు.         

లంచంతో పాటు మోసం ఆరోపణలు
లంచం ఆరోపణలు బయటపడిన తర్వాత, గౌతమ్ అదానీ మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ డైరెక్టర్లపై అమెరికా న్యాయ శాఖ, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మోపిన లంచం & మోసం ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ డైరెక్టర్లపై అమెరికాలో నమోదైన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. "నేరారోపణ పత్రంలోని అభియోగాలు కేవలం ఆరోపణలు మాత్రమే. దోషులుగా నిరూపితమయ్యే వరకు ప్రతివాదులను నిర్దోషులుగానే భావించాలి" అని అమెరికా న్యాయ శాఖ స్వయంగా చెప్పినట్లు, అదానీ గ్రూప్ ప్రతినిధి అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు.

మరో ఆసక్తికర కథనం: ఇండియా-యూఎస్‌ కలిపి పని చేయాలి - చైనాను ఎదుర్కొనే ప్లాన్‌ చెప్పిన ట్రంప్‌ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget