News
News
X

Dhanteras 2021: ఈ దంతేరాస్‌కి గోల్డ్ కాయిన్ రూ.1 కే కొనొచ్చు.. ఎలాగో తెలుసా, చాలా సింపుల్

ప్రస్తుతం 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకు రూ.4,900 దాటింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మంది ఇంత డబ్బు బంగారంపై పెట్టుబడి పెట్టడం కాస్త ఇబ్బందికరమే.

FOLLOW US: 

ఏటా ధనత్రయోదశి (దంతేరాస్)కి బంగారం లేదా వెండి కొనడం భారతీయులకు అనాదిగా ఓ సాంప్రదాయంగా వస్తుంది. అసలే కరోనా సంక్షోభం వల్ల కొంత మందికి ఆదాయం తగ్గిపోయిన ఈ రోజుల్లో మళ్లీ బంగారం కొనడం అంటే మాటలు కాదు. కనీసం ఒక్క గ్రాము బంగారు నాణెం కొనాలన్నా అన్ని ఛార్జీలు కలిపి దాదాపు రూ.5 వేలు అవుతుంది. ఎందుకంటే.. ప్రస్తుతం 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకు రూ.4,900 దాటింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మంది ఇంత డబ్బు బంగారంపై పెట్టుబడి పెట్టడం ఇబ్బందికరమే. కానీ, దంతేరాస్‌కు ఏటా బంగారం కొనే సాంప్రదాయాన్ని కొనసాగించేవారు, అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు తమ వద్ద ఉన్న తక్కువ సొమ్ముతోనే బంగారం కొనే మార్గం ఒకటుంది. కనీసం రూ.1 తో కూడా మీరు బంగారం కొనొచ్చు. ఎలాగంటే.. 

మీ దగ్గర ఉన్న డబ్బులతో డిజిటల్ రూపంలో బంగారం కొనొచ్చు. కనీసం రూ.1 తో కూడా అందుకు తగ్గ బంగారం కొనే అవకాశం ఉంటుంది. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి మొబైల్ వ్యాలెట్ కంపెనీలు దంతేరాస్ సందర్భంగా 99.99 శాతం స్వచ్ఛత ఉన్న కాయిన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాక, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ వంటి సంస్థలు కూడా డిజిటల్ గోల్డ్ కొనేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. తెలియని వారి కోసం, డిజిటల్ గోల్డ్ ఇటీవల ప్రముఖ పెట్టుబడి సాధనంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇలా డిజిటల్ బంగారం కొనండి
* మీ ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి
* కిందికి స్ర్కోల్ చేస్తే గోల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది
* అది సెలెక్ట్ చేసుకొని మీరు చిన్న మొత్తాల్లోనూ చెల్లింపులు జరిపి డిజిటల్ గోల్డ్‌ను కొనుక్కోవచ్చు.
* మీరు కొన్న డిజిటల్ బంగారానికి 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. భౌతికరూపంలో దుకాణాల్లో కొన్నా సరే ఈ 3 శాతం జీఎస్టీ తప్పదు.
* మీరు కొన్న డిజిటల్ బంగారం మీ మొబైల్ వ్యాలెట్‌లోనే గోల్డ్ లాకర్ అనే ఆప్షన్‌లో భద్రంగా ఉంటుంది.
* మీ గోల్డ్ లాకర్‌లో ఉన్న బంగారానికి తోడు మీరు మరింతగా మీ వద్ద డబ్బున్నప్పుడు డిజిటల్ బంగారం కొనొచ్చు లేదా అక్కడి నుంచే అమ్మే వెసులుబాటు కూడా ఉంటుంది. అంతేకాక, ఎవరికైనా గిఫ్ట్ పంపే సౌకర్యం కూడా ఉంటుంది.
* గోల్డ్ లాకర్‌లో పోగుపడ్డ డిజిటల్ బంగారం అమ్మాలనుకుంటే అక్కడే ‘సెల్’ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే గిఫ్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది.

ఆ బంగారం ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు
మీరు కొనే ఈ డిజిటల్ బంగారం గోల్డ్ లాకర్‌లో కనీసం అర గ్రాము వరకూ పోగు పడితే మీరు దాన్ని కాయిన్స్‌ రూపంలోనూ పొందవచ్చు. అందుకోసం అక్కడే మరో ఆప్షన్ ఉంటుంది. తద్వారా కోరుకున్న అడ్రస్‌కే పంపుతారు.

News Reels

దంతేరాస్ అనేది ఏటా దీపావళికి రెండ్రోజుల ముందు వస్తుంది. ఈ రోజును పవిత్రంగా భావించే భారతీయులు.. ఎక్కువగా బంగారం కొంటుంటారు. ఈ ఏడాది నవంబరు 2న దంతేరాస్ వచ్చింది.

Published at : 31 Oct 2021 11:31 AM (IST) Tags: Dhanteras Gold Buying Digital gold buying gold buying rate today gold buying online dhanteras 2021 date

సంబంధిత కథనాలు

Health Insurance Top-Up: 40 ఏళ్ల వయస్సులో ఈ పని చేయగలిగితే బెటర్‌- ఆసుపత్రిపాలైనా డబ్బులకు టెన్షన్ ఉండదు!

Health Insurance Top-Up: 40 ఏళ్ల వయస్సులో ఈ పని చేయగలిగితే బెటర్‌- ఆసుపత్రిపాలైనా డబ్బులకు టెన్షన్ ఉండదు!

credit cards: ఇయర్‌ ఎండ్‌కు ఎగిరిపోతారా! ఈ క్రెడిట్‌ కార్డులతో మస్తు బెనిఫిట్స్‌!

credit cards: ఇయర్‌ ఎండ్‌కు ఎగిరిపోతారా! ఈ క్రెడిట్‌ కార్డులతో మస్తు బెనిఫిట్స్‌!

Stock Market News: పెట్టుబడిని పెంచే టిప్స్‌ కావాలా?, దాదాపు 155% ర్యాలీ చేసే 8 స్టాక్స్‌ ఇవిగో!

Stock Market News: పెట్టుబడిని పెంచే టిప్స్‌ కావాలా?, దాదాపు 155% ర్యాలీ చేసే 8 స్టాక్స్‌ ఇవిగో!

Stock Market Opening: ఐటీ రాక్స్‌.. సూచీలు కిర్రాక్‌! 63,400 వద్ద సెన్సెక్స్‌, 18,800 మీదే నిఫ్టీ

Stock Market Opening: ఐటీ రాక్స్‌.. సూచీలు కిర్రాక్‌! 63,400 వద్ద సెన్సెక్స్‌, 18,800 మీదే నిఫ్టీ

Stocks to watch 01 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - కొత్త అగ్రిమెంట్లలో TCS, Wipro

Stocks to watch 01 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - కొత్త అగ్రిమెంట్లలో TCS, Wipro

టాప్ స్టోరీస్

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట- షరతులతో కూడిన బెయిల్ మంజూరు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట- షరతులతో కూడిన బెయిల్ మంజూరు

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!

India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!