News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brand Value: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌ TCS, సెకండ్‌ ప్లేస్‌లో రిలయన్స్‌

ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్న TCS బ్రాండ్‌ వాల్యూ రూ. 1,09,576 కోట్లు.

FOLLOW US: 
Share:

Most Valuable Indian Brand: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS), భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్ కన్సల్టెన్సీ కంపెనీ ఇంటర్‌బ్రాండ్ (Interbrand) ఈ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేసింది. భారతదేశంలోని అత్యంత విలువైన బ్రాండ్‌లతో టాప్-50 లిస్ట్‌ను ప్రకటించింది. 

ఈ సంవత్సరం ఎడిషన్‌లోని మొత్తం కంపెనీల విలువ రూ. 8,31,005 కోట్లు ($100 బిలియన్లు). గత దశాబ్ద కాలంలో ఈ విలువ ఏకంగా 167% పెరిగింది. లిస్ట్‌ మొత్తం విలువ $100 బిలియన్‌ మార్కును దాటడం ఇదే తొలిసారి.

మోస్ట్‌ వాల్యూడ్‌ టాప్‌-10 ఇండియన్‌ బ్రాండ్స్‌:

ఇంటర్‌బ్రాండ్ రిపోర్ట్‌ ప్రకారం, ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్న TCS బ్రాండ్‌ వాల్యూ రూ. 1,09,576 కోట్లు. సెకండ్‌ ర్యాంక్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రాండ్‌ విలువ రూ. 65,320 కోట్లు. మూడో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ వాల్యూ రూ. 53,324 కోట్లు. 

4. HDFC బ్యాంక్‌ - రూ. 50,291 కోట్లు.
5. జియో - రూ. 49.027 కోట్లు.
6. ఎయిర్‌టెల్‌ - రూ. 46,553 కోట్లు
7. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) - రూ. 33,792 కోట్లు
8. మహీంద్ర & మహీంద్ర - రూ. 31,136 కోట్లు
9. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) - రూ. 30.055 కోట్లు
10. ICICI బ్యాంక్‌ - రూ. 25,915 కోట్లు

టాప్-10 బ్రాండ్‌ల మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్‌ల వాటానే 46% ‍‌(దాదాపు సగం వాటా). టాప్‌-5 బ్రాండ్‌ల మొత్తం వాల్యూ, పట్టిక మొత్తం విలువలో 40%కు సమానం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గత దశాబ్దంలో కాలంలో తొలిసారిగా మూడు టెక్నాలజీ బ్రాండ్‌లు టాప్‌-5లో చోటు సంపాదించాయి.

టాప్ టెన్ బ్రాండ్‌ల మొత్తం వాల్యూ రూ. 4,94,992 కోట్లు. లిస్ట్‌ మిగిలిన 40 కంపెనీల బ్రాండ్‌ల విలువ రూ. 3,36,013 కోట్లు. అంటే, ఈ 40 కంపెనీల బ్రాండ్‌ విలువ కన్నా టాప్‌-10 కంపెనీల బ్రాండ్‌ వాల్యూ ఎక్కువ.

"టాప్-10 బ్రాండ్‌ల అసాధారణ పనితీరు వాటి స్ట్రాటెజిక్‌ ఫోకస్‌, సమర్థతను స్పష్టంగా చెబుతోంది. హోమ్ బిల్డింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ రంగాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించిందన్నారు. 2014 నుంచి ఏడు కొత్త బ్రాండ్‌లు ఈ లిస్ట్‌లోకి వచ్చాయి" - ఇంటర్‌బ్రాండ్ ఇండియా & దక్షిణాసియా CEO ఆశిష్ మిశ్రా

దూసుకెళ్తున్న FMCG సెక్టార్‌ 
గత పదేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో... FMCG సెక్టార్‌ 25% CAGR వృద్ధితో టాప్‌లో ఉంది. ఆ తర్వాత గృహ నిర్మాణం & మౌలిక సదుపాయాలు 17% CAGRతో, టెక్నాలజీ సెక్టార్‌ 14% CAGR వద్ద వృద్ధి చెందాయి.

హోమ్ బిల్డింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం రూ. 6,900 కోట్ల నుంచి రూ. 34,400 కోట్లకు ఎగబాకింది. టెక్నాలజీ సెక్టార్‌ రూ. 69,300 కోట్ల నుంచి రూ. 2.5 లక్షల కోట్లకు విస్తరించింది.

"$100 బిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించడం అద్భుతమైన ఫీట్. ప్రపంచ స్థాయిలో ఇండియన్‌ బ్రాండ్‌ల బలం, సామర్థ్యానికి ఇది నిదర్శనం” - ఇంటర్‌బ్రాండ్ గ్లోబల్ CEO గొంజలో బ్రూజో

టాప్‌-50 లిస్ట్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌ నుంచి 9 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. హోమ్ బిల్డింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌ నుంచి 7 కంపెనీలు ఉన్నాయి.

మరో ఆసక్తికర కథనం: భారత్‌ ఒక సూపర్‌ ఎకానమీ, అంచనాలను మించి 7.2% వృద్ధి రేటు

Published at : 01 Jun 2023 11:27 AM (IST) Tags: brand value Marketing interbrand brand ranking most valuable brand

ఇవి కూడా చూడండి

YES Bank FD Rates: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

YES Bank FD Rates: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

Cement Prices: మంట పుట్టిస్తున్న సిమెంటు, సొంతింటి కల మరింత ఖరీదు గురూ!

Cement Prices: మంట పుట్టిస్తున్న సిమెంటు, సొంతింటి కల మరింత ఖరీదు గురూ!

IT Stocks: ఫారినర్ల మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ఐటీ స్టాక్స్‌, రెండున్నర నెలల్లో రూ.7 వేల కోట్ల షాపింగ్‌

IT Stocks: ఫారినర్ల మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ఐటీ స్టాక్స్‌, రెండున్నర నెలల్లో రూ.7 వేల కోట్ల షాపింగ్‌

Stock Market Today: బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్ల పతనం - భారీ నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Today: బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్ల పతనం - భారీ నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Latest Gold-Silver Price 04 October 2023: ఏడు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 04 October 2023: ఏడు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

YSRCP Nominated posts: వైసీపీలో త్వరలో నామినేటెడ్‌ పదవుల భర్తీ-ఎన్నికల వేళ సీఎం జగన్‌ వ్యూహం

YSRCP Nominated posts: వైసీపీలో త్వరలో నామినేటెడ్‌ పదవుల భర్తీ-ఎన్నికల వేళ సీఎం జగన్‌ వ్యూహం

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్