అన్వేషించండి

EPFO New Rules: పెద్ద భారం తగ్గించిన EPFO - కేవైసీ పూర్తయితే క్లెయిమ్‌ చేయడం ఇప్పుడు ఈజీ

EPFO News Update: క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం చెక్ లీఫ్‌ లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిన లేదా ఫిజికల్‌గా సమర్పించాల్సిన అవసరం ఉండదు. క్లెయిమ్ సెటిల్‌మెంట్స్‌ వేగవంతం అవుతాయి.

EPF New Withdrawl Rules 2024: ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల విషయంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (Employees' Provident Fund Organisation) కొత్త సౌలభ్యాలు తీసుకువస్తూనే ఉంది. సాధారణంగా, ఈపీఎఫ్‌ కోసం ఒక చందాదారు (EPFO Subscriber) క్లెయిమ్‌ చేసుకున్నప్పుడు, వర్తించే అన్ని నిబంధనలను అతను సంతృప్తి పరచాలి. ఒక్క నియమం పాటించకపోయినా క్లెయిమ్‌ దరఖాస్తును సంబంధిత ప్రాంతీయ కార్యాలయం (EPFO Regional Office) తిరస్కరిస్తుంది. ఇలా తిరస్కరించే కారణాల్లో... బ్యాంక్‌ చెక్ లీఫ్‌, బ్యాంకు పాస్‌ పుస్తకం కాపీని సమర్పించకపోవడం కూడా ఒకటి. 

చెక్ లీఫ్ లేదా అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ కాపీని అప్‌లోడ్ చేయనందుకు EPFO రీజినల్‌ ఆఫీసులు వేలకొద్దీ క్లెయిమ్స్‌ తిరస్కరిస్తున్నాయి. ఈ సమస్యకు EPFO ఒక చక్కటి పరిష్కారం చూపింది. ఆధార్‌ KYC పూర్తయితే చాలని చెప్పింది. ఈ వెసులుబాటు వల్ల, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం చెక్ లీఫ్‌ లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిన లేదా ఫిజికల్‌గా సమర్పించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్స్‌ వేగవంతం అవుతాయి.

ఒక షరతు వర్తిస్తుంది
చెక్ లీఫ్‌ లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను సమర్పించకపోయినా EPF క్లెయిమ్‌ చేసుకోవాలంటే, ముందుగా, చందాదారుడి బ్యాంకు ఖాతాలో KYC పూర్తయి ఉండాలి. అంటే, క్లెయిమ్‌ చేసుకున్న వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించి ఆధార్‌ KYC పూర్తయి ఉండాలి. ఆధార్‌ KYC ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్ లీఫ్‌, బ్యాంక్‌ పాసు బుక్‌ కాపీని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవి లేకుండానే క్లెయిమ్‌ సెటిల్‌ అవుతుంది. 

KYC పూర్తయిన చందాదారు క్లెయిమ్‌ కోసం అప్లై చేసుకుంటే, "బ్యాంక్‌ KYC అథెంటికేషన్‌ ఆన్‌లైన్‌లో పూర్తయింది. చెక్ లీఫ్‌, పాస్‌ బుక్‌ కాపీని సమర్పించాల్సిన చేయాల్సిన అవసరం లేదు" అనే సూచన సంబంధిత రీజినల్‌ ఆఫీసుకు ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ ఫామ్‌లో కనిపిస్తుందని EPFO ప్రకటించింది. ఈ సూచన కనిపిస్తే, చెక్ లీఫ్‌, పాస్‌ బుక్‌ కాపీ కోసం చూడకుండా క్లెయిమ్‌ సెటిల్‌ చేయాలని ప్రాంతీయ కార్యాలయాను ఆదేశించింది.

ఆన్‌లైన్‌లో EPF క్లెయిమ్ ఎలా చేయాలి? (How to claim EPF online?)

-- ముందు, https://unifiedportal-mem.epfindia.gov.in/ లింక్‌ ద్వారా EPFO అధికారిక పోర్టల్‌లోకి వెళ్లాలి. UAN, పాస్‌వర్డ్‌ నమోదు చేసి లాగిన్‌ కావాలి.
-- హోమ్‌ పేజీలో, క్లెయిమ్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
-- పెన్షన్ లేదా ఫుల్‌ సెటిల్‌మెంట్‌ వంటి క్లెయిమ్ రకాన్ని ఎంచుకోండి.
-- ఇక్కడ, ముందుగానే పూరించిన వివరాలు ఉంటాయి. ఆ వివరాలను ఒకసారి క్రాస్‌ చెక్‌ చేయండి.
-- ఒకవేళ ఆధార్‌ KYC పూర్తయితే, EPFO ఇచ్చిన కొత్త వెసులుబాటు సబ్‌స్క్రైబర్‌కు ఇక్కడ ఉపయోగపడుతుంది.
-- ఆ తర్వాత, ఆ పేజీలో ఉన్న మొత్తం సమాచారాన్ని మీరు ధృవీకరించాలి, ఆ తర్వాత క్లెయిమ్‌ సబ్మిట్‌ చేయాలి.
-- ఇక్కడి నుంచి జరగాల్సిన పనిని EPFO రీజినల్‌ ఆఫీస్‌ చూసుకుంటుంది, తగిన పరిశీలన తర్వాత మీ క్లెయిమ్‌కు ఆమోదం తెలుపుతుంది. 

మీరు సమర్పించిన క్లెయిమ్‌ ప్రాసెస్‌ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి ఇదే పోర్టల్‌లో స్టేటస్‌ చెక్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌ నంబర్‌ 7 - మేడమ్ నంబర్‌ 1- కొత్త రికార్డు దిశగా నిర్మలా సీతారామన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
Embed widget