అన్వేషించండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Paytm, Adani Grn, Muthoot Micro, Suraj Estate, Anupam

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 26 December 2023: దేశీయ మార్కెట్లు గత శుక్రవారం లాభపడ్డాయి. అయితే, ఏడు వారాల విజయ పరంపరను ప్రాఫిట్ బుకింగ్ దెబ్బకొట్టింది. క్రిస్మస్‌ సెలవుల కారణంగా ఈ వారం గ్లోబల్ మార్కెట్లలో పెద్దగా స్పందనలు ఉండకపోవచ్చు. కాబట్టి, దేశీయ సంకేతాలతోనే ఇండియన్‌ మార్కెట్లు కదులుతాయి.

ఆసియా మార్కెట్లు
ఈ రోజు ఓపెనింగ్‌ టైమ్‌లో ఆసియా మార్కెట్లు పెద్దగా మారలేదు. జపాన్ ఈక్విటీస్‌ బెంచ్‌మార్క్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయి. హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సహా చాలా మార్కెట్లు సెలవులో ఉన్నాయి.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 14 పాయింట్లు లేదా 0.07% రెడ్‌ కలర్‌లో 21,423 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ముత్తూట్ మైక్రోఫిన్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్‌: ఈ రెండు స్టాక్స్‌ ఈ రోజు మార్కెట్లలో లిస్ట్‌ అవుతాయి. మొదటిది 11.5 రెట్లు, రెండోది 15.7 రెట్లు వరకు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి.

పేటీఎం: నియంత్రణ నిబంధనల్లో మార్పుల కారణంగా తన వ్యాపారంలో మార్పులు, కృత్రిమ మేధను అప్లై చేయడం వంటి కారణాలతో కొంత మంది ఉద్యోగులను పేటీఎం తొలగించింది. 

కళ్యాణ్ జ్యువెలర్స్: UAEలోని పూర్తి స్థాయి స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రొక్యూర్‌మెంట్ LLCని స్టార్ట్‌ చేసింది.

అనుపమ్ రసాయన్: రాబోయే 9 సంవత్సరాల పాటు న్యూ-ఏజ్‌ పాలిమర్ ఇంటర్మీడియట్‌ను సరఫరా చేయడానికి ప్రముఖ జపనీస్ మల్టీ నేషనల్ కెమికల్ కంపెనీ నుంచి రూ.507 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

అదానీ గ్రీన్: 1,799 మెగావాట్ల సౌర విద్యుత్‌ను సరఫరా చేయడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) కుదుర్చుకుంది. దీంతో, అదానీ గ్రీన్ ఒప్పందాలు 19.8 గిగావాట్లకు చేరాయి.

ONGC: కంపెనీ పూర్తి యాజమాన్యంలోని విదేశీ విభాగం ONGC విదేశ్ క్యాపెక్స్, రుణాల చెల్లింపు & రోజువారీ కార్యకలాపాల కోసం నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ (NCDలు) జారీ చేసి రూ.5,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది.

అరబిందో ఫార్మా: న్యూజెర్సీలోని ఈస్ట్ విండ్సర్‌లో ఉన్న కొత్త ఇంజెక్టబుల్ ఫెసిలిటీలో ప్రి-అప్రూవల్ ఇన్‌స్పెక్షన్‌ను US FDA పూర్తి చేసినట్లు ఈ కంపెనీ తెలిపింది. తనిఖీ తర్వాత 10 అబ్జర్వేషన్లను US FDA జారీ చేసింది.

అదానీ విల్మార్: మినిమమ్‌ పబ్లిక్ షేర్ హోల్డింగ్ రూల్స్‌ ప్రకారం, ఈ కంపెనీ ప్రమోటర్లు 1.24 శాతం వాటాను ఆఫ్‌లోడ్ చేస్తారు. ఇది జనవరి 31, 2024 లోపు జరగాలి.

బయోకాన్: ఈ కంపెనీకి చెందిన బయోకాన్ బయోలాజిక్స్, జపాన్‌లో అడాలిముమాబ్ పంపిణీ, విక్రయం, ప్రచారం కోసం శాండోజ్‌తో ఒప్పందం చేసుకుంది.

ఈ రోజు F&O నిషేధంలో ఉన్న స్టాక్స్‌: అశోక్ లేలాండ్, బలరాంపూర్ చీని, డెల్టా కార్ప్, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్స్, నేషనల్ అల్యూమినియం, సెయిల్.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: బ్యాంకింగ్‌ దిశను మార్చిన RBI నిర్ణయాలు, మీ డబ్బులపైనా వీటి ఎఫెక్ట్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Embed widget