By: ABP Desam | Updated at : 26 Dec 2023 08:00 AM (IST)
బ్యాంకింగ్ దిశను మార్చిన RBI నిర్ణయాలు
Changes brought by RBI in 2023: ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగుస్తంది. ఇన్వెస్టర్లకు ఈ ఏడాది చాలా మేలు జరిగింది. స్టాక్ మార్కెట్‌లోకి వచ్చిన చాలా IPOలు పెట్టుబడిదార్లకు లాభాలు పంచాయి. ద్రవ్యోల్బణం శాంతించింది. GDP, GST గణాంకాలు గట్టిగా ఉన్నాయి. వీటిని బట్టి, 2024 సంవత్సరం శుభప్రదంగా కొనసాగుతుందన్న సంకేతాలను 2023 ఇస్తోంది.
ఈ ఏడాది కాలంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బ్యాంకింగ్ రంగంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో 4 నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, ప్రజల నోళ్లలో ఎక్కువగా నానాయి. ఆ కీలక మార్పులు బ్యాంకింగ్ సెక్టార్ (Banking sector in 2023) దిశను మార్చాయి.
2023లో ఆర్‌బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు:
2000 రూపాయల నోటుకు మంగళం (Withdrawal of 2000 rupees notes)
డీమోనిటైజేషన్ (Demonetization) సమయంలో తీసుకొచ్చిన రూ.2000 నోట్లను ఆర్థిక వ్యవస్థ నుంచి ఆర్‌బీఐ వెనక్కు తీసుకుంది. 2023 మే 19న, రూ.2000 నోట్ల ఉపసంహణ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని రాత్రికి రాత్రే అమల్లోకి తీసుకురాలేదు. 2000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రజలకు 4 నెలల సమయం ఇచ్చింది. 2023 నవంబర్ 30న బిజినెస్ ముగిసే నాటికి, చెలామణిలో ఉన్న ₹2000 నోట్లలో 97.26% బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చాయి. రూ.9,760 కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఇంకా తిరిగి రాలేదు, అవన్నీ ప్రజల దగ్గరే ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: 2024లో రూ.10 లక్షల్లోపు ధరలో లాంచ్ అయ్యే కార్లు - కొత్త ఫీచర్లు, సూపర్ డిజైన్లు!
పర్సనల్ లోన్స్‌కు నిరుత్సాహం
వ్యక్తిగత రుణాలు అన్‌సెక్యూర్డ్ లోన్స్ (Unsecured Loans) కిందకు వస్తాయి. వీటి వల్ల బ్యాంక్‌లకు రిస్క్ ఎక్కువ. గత కొన్నేళ్లుగా ఈ తరహా లోన్స సంఖ్య పెరుగుతుండటంతో, ఆర్‌బీఐ మొదట బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (NBFCs) హెచ్చరించింది. పర్సనల్ లోన్స్ (Personal Loans) మీద రిస్క్ వెయిటేజీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. NBFCల రిస్క్ వెయిట్‌ను (Risk weight) 100 నుంచి 125కి పెంచబడింది. దీని వల్ల NBFCల వ్యాపారం ప్రతికూలంగా ప్రభావితమైంది.
UPI లావాదేవీల పరిమితి పెంపు
ఆర్థిక సేవల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి UPI (Unified Payment Interface) లావాదేవీల పరిమితిని RBI పెంచింది. విద్యాసంస్థలు & ఆసుపత్రుల్లో చేసే UPI ఆధారిత లావాదేవీల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. అంతకుముందు ఇది రూ.1 లక్షగా ఉంది.
రెపో రేట్‌పై స్టేటస్ కో
తాజాగా, 2023 డిసెంబర్‌లో ద్రవ్య విధానాన్ని (monetary policy) సమీక్షించినప్పుడు, రెపో రేటును (RBI Repo rate) 6.5 శాతం వద్ద RBI యథాతథంగా ఉంచింది. ఆర్‌బీఐ, తన రెపో రేటును స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి. ఓవరాల్‌గా చూస్తే, రెపో రేటు 2023 ఫిబ్రవరిలో మాత్రమే పెరిగింది. దీని కారణంగా, ఆర్థిక రంగంలో స్థిరత్వం ఏర్పడింది.
మరో ఆసక్తికర కథనం: 2024లో బ్యాంకులకు నెలన్నర సెలవులు - ఈ లిస్ట్‌ను బట్టి మీ పనిని ప్లాన్ చేసుకోండి
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ