అన్వేషించండి

Upcoming Cars Under 10 Lakh: 2024లో రూ.10 లక్షల్లోపు ధరలో లాంచ్ అయ్యే కార్లు - కొత్త ఫీచర్లు, సూపర్ డిజైన్లు!

2024 Affordable Cars: రాబోయే 2024లో ఎన్నో బడ్జెట్ కార్లు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో కియా సోనెట్, టాటా అల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ మోడళ్లు కూడా ఉన్నాయి.

New Cars Under 10 Lakh: మొదటి సారి కార్లను కొనుగోలు చేసే వ్యక్తులు ఎక్కువగా చవకైన ఆప్షన్ల కోసం చూస్తున్నారు. 2024లో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరతో విడుదల కానున్న ఐదు కార్ల గురించి తెలుసుకుందాం.

కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్
దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా 2024 జనవరిలో భారతీయ మార్కెట్లోకి సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది. కొనుగోలుదారులు ఈ కొత్త మోడల్‌ను ఆన్‌లైన్‌లో లేదా అఫీషియల్ కియా డీలర్‌షిప్‌ల్లో రూ. 20,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని ప్రారంభ ధర సుమారు రూ. 8 లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే మిడ్, హై స్పెక్ వేరియంట్‌ల ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉండనుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే చాలా పెద్ద మార్పులు ఉండనున్నాయి. కానీ ఇంజిన్ ఆప్షన్లు మాత్రం అలాగే ఉండనున్నాయి.

ఆల్ న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి 2024 మొదటి త్రైమాసికంలో కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను దేశంలో విడుదల చేయనుంది. ఈ నవీకరించబడిన మోడల్ HEARTECT ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు అయింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్, బలెనో నుంచి ఇన్‌స్పైర్ అయిన కొత్త మోడల్ స్వల్ప డిజైన్ మార్పులతో పూర్తిగా కొత్త ఇంటీరియర్‌ను పొందుతుంది. ఇది పెట్రోల్, హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది. ఇది 1.2 లీటర్ డీవోహెచ్‌సీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 82 బీహెచ్‌పీ పవర్‌ని, 108 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5 స్పీడ్ మాన్యువల్, కొత్త సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

కొత్త తరం మారుతి డిజైర్
కొత్త స్విఫ్ట్‌తో పాటు, మారుతి సుజుకి కొత్త తరం డిజైర్ సబ్ 4 మీటర్ సెడాన్‌ను కూడా విడుదల చేయబోతోంది. ఇది 2024 మధ్య నాటికి అమ్మకానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త స్విఫ్ట్ డిజైన్, ఇంటీరియర్ అప్‌డేట్‌లను హ్యాచ్‌బ్యాక్‌తో షేర్ చేయనుంది. ఈ సెడాన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో హైబ్రిడ్ టెక్నాలజీతో 1.2 లీటర్ 3 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది.

టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్
2024లో టాటా మోటార్స్ దేశంలో అప్‌డేట్ అయిన అల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేస్తుంది. కొత్త మోడల్‌కు తాజా ఇంటీరియర్‌తో పాటు కొత్త టాటా కార్ల ప్రేరణతో డిజైన్ అప్‌డేట్‌లు లభిస్తాయి. ఇది పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్) వంటి అనేక ఇతర ఫీచర్లను పొందుతుంది. రేసర్ ఎడిషన్ 120 బీహెచ్‌పీ, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లేదా కొత్త 125 బీహెచ్‌పీ, 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఉంటాయి.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్
కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి ముందు నిస్సాన్ 2024 మధ్యలో దేశంలో మాగ్నైట్ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీకి ప్రధాన అప్‌డేట్‌ను అందిస్తుంది. ఇది కాకుండా కంపెనీ కొత్త మాగ్నైట్‌ను మెక్సికో వంటి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (LHD) మార్కెట్‌లకు ఎగుమతి చేయడం కూడా ప్రారంభిస్తుంది. ఈ చిన్న ఎస్‌యూవీ డిజైన్‌లో కొన్ని మార్పులు, మరిన్ని ఫీచర్ లోడెడ్ ఇంటీరియర్‌లను పొందవచ్చని భావిస్తున్నారు. అయితే ఇంజిన్ ఎంపికలు అలాగే ఉంటాయని భావిస్తున్నారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget