Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Texrail, BHEL, PVR Inox, Vedanta
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 15 December 2023: US ఫెడ్, అమెరికాలో వడ్డీ రేట్లను మార్చకపోవడం, వచ్చే ఏడాది రేటు తగ్గింపులపై సూచనలు ఇవ్వడంతో గురువారం ఇండియన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు 1% పైగా ర్యాలీ చేశాయి, ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా ఈక్విటీ మార్కెట్లు విజయోత్సవాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. దేశంలో బలమైన గ్రోత్ డేటా కొనసాగడం, ఏడాది మధ్య నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలతో, మీడియం టర్మ్‌లో ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగవచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
లాభాలు కొనసాగించిన యూఎస్ మార్కెట్లు
ఓవర్‌నైట్‌లో, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.43 శాతం, ఎస్&పి 500 0.26 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.19 శాతం పెరిగాయి.
10 సంవత్సరాల బెంచ్‌మార్క్ ట్రెజరీ ఈల్డ్, ఆగస్టు తర్వాత మొదటిసారిగా 4 శాతం దిగువకు పడిపోయింది.
పెరిగిన ఆసియా మార్కెట్లు
ఆసియాలో, ASX 200, నికాయ్, కోస్పి, హ్యాంగ్ సెంగ్ 0.9 శాతం నుంచి 1.27 శాతం వరకు పెరిగాయి.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 22 పాయింట్లు లేదా 0.01% రెడ్ కలర్‌లో 21,421 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
PVR-ఐనాక్స్: ప్లెంటీ ప్రైవేట్ గ్రూప్ & మల్టిపుల్స్ ప్రైవేట్ గ్రూప్, ఈ రోజు బ్లాక్ డీల్ ద్వారా ఈ కంపెనీలో 2.33 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది.
కేఫిన్ టెక్నాలజీస్: గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్, బ్లాక్ డీల్ ద్వారా కేఫిన్ టెక్నాలజీస్‌లో 6.2% షేర్లను అమ్మే అవకాశం ఉంది.
వేదాంత: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) జారీని పరిశీలించడానికి ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 19న సమావేశం అవుతుంది.
BHEL: హైడ్రోజన్ వాల్యూ చైన్, IIoT సొల్యూషన్స్ విభాగాల్లో సాంకేతిక అభివృద్ధిపై సహకారం కోసం, BHEL - CMTI ఒక అవగాహన ఒప్పందంపై (MOU) సంతకం చేశాయి.
హీరో మోటోకార్ప్: చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (CFO) వివేక్ ఆనంద్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా (CHRO) రచన కుమార్‌ను హీరో మోటోకార్ప్ నియమించింది. వివేక్, రచన నేరుగా CEOకు రిపోర్ట్ చేస్తారు.
M&M ఫైనాన్షియల్: జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమాల్లో కార్పొరేట్ ఏజెంట్ (మిశ్రమ) తరహాలో ఇన్సూరెన్స్ బిజినెస్‌ను పెంచుకోవడం కోసం అనుబంధ వ్యాపార కార్యకలాపాలు చేపట్టేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. వ్యక్తిగత బీమా, గ్రూప్ బీమా రెండు విభాగాల్లో ఈ కార్యకలాపాలు చేపడతారు.
టెక్స్‌మాకో రైల్: రూ. 1374 కోట్ల విలువైన 3,400 BOXNS వ్యాగన్ల తయారీ, సరఫరా కోసం రైల్వే మంత్రిత్వ శాఖ టెక్స్‌మాకో రైల్‌కు ఆర్డర్ ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఒక్కరోజులో ఊహించనంత పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి