Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Banks, Auto, Zomato, Adani Ports
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 08 February 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మూడు రోజుల ద్రవ్య విధాన సమావేశం (MPC) ఈ రోజు (గురువారం) ముగుస్తుంది. ఉదయం 11 సమయంలో వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడుతుంది. ఆర్‌బీఐ, తన రెపో రేట్‌ను ఈసారి కూడా మార్చదని, 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతుందని మార్కెట్ పార్టిసిపెంట్లు భావిస్తున్నారు. దేశంలో CPI ద్రవ్యోల్బణం RBI గరిష్ట బ్యాండ్ 6 శాతానికి దగ్గరగా ఉన్నందున, కనీసం ఈ ఏడాది జులై వరకు రేట్లు మారకుండా ఉండవచ్చని రాయిటర్స్ నిర్వహించిన ఒక పోల్ అంచనా వేసింది. ఏది ఏమైనా, బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ RBI ద్రవ్య విధాన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి.
ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 01 పాయింట్లు లేదా 0.01 శాతం గ్రీన్ కలర్‌లో 22,054 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం హాంగ్ సెంగ్ 0.2 శాతం క్షీణించింది. ఇది మినహా ఆసియా మార్కెట్లు ఆశావహంగా ట్రేడ్ అవుతున్నాయి. జనవరి నెలలో, చైనా CPI ఇన్‌ఫ్లేషన్ 0.8 శాతం తగ్గింది, అంచనాల కంటే మెరుగ్గా ఉంది. నికాయ్, ASX 200, కోస్పీ ఇండెక్స్‌లు 0.5 నుంచి 0.9 శాతం వరకు పెరిగాయి.
నిన్న, USలో, S&P 500 0.82 శాతం, డౌ జోన్స్ 0.4 శాతం, నాస్‌డాక్ 0.95 శాతం పెరిగింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: గ్రాసిమ్ ఇండస్ట్రీస్, LIC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, జొమాటో, బయోకాన్, ఆర్తి ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, అస్టర్ DM హెల్త్‌కేర్, ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా, బలరాంపూర్ చినీ మిల్స్, BEML, కాంకర్డ్ బయోటెక్, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎస్కార్ట్స్ కుబోటా, హిట్స్, హనీవెల్ ఆటోమేషన్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ITD సిమెంటేషన్, JK లక్ష్మి సిమెంట్, NCC, పేజ్ ఇండస్ట్రీస్, పతంజలి ఫుడ్స్, రైల్ వికాస్ నిగమ్, SKF ఇండియా, థర్మాక్స్, టోరెంట్ పవర్, జైడస్ వెల్‌నెస్.
వడ్డీ రేట్లకు ప్రతిస్పందించే స్టాక్స్: రియల్ ఎస్టేట్, బ్యాంకులు, ఫైనాన్షియల్స్, ఆటో స్టాక్స్ వంటివి వడ్డీ రేట్ల ప్రతిస్పందిస్తాయి, మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
అదానీ పోర్ట్స్: పోర్ట్స్ టాంజానియాలోని ప్రధాన నౌకాశ్రయం డార్ ఎస్ సలామ్‌లో కంటైనర్ టెర్మినల్‌ను నిర్వహించే బిడ్‌ను గెలుచుకుంది. దీంతో ఈ యూనిట్ తూర్పు ఆఫ్రికాలో స్థిరంగా వ్యాపారం చేస్తుంది.
పెట్రోనెట్ LNG: దీర్ఘకాలిక ప్రాతిపదికన, సుమారు 7.5 MMTPA లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కొనుగోలు కోసం ఖతార్ ఎనర్జీతో దీర్ఘకాలిక LNG అమ్మకం & కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
అశోక బిల్డ్‌కాన్: బీహార్‌లోని ఒక ప్రాజెక్ట్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి రూ. 520 కోట్ల విలువైన బిడ్ గెలుచుకుంది.
జొమాటో: ఫుడ్ డెలివరీ సంస్థ రెండు స్టెప్-డౌన్ సబ్సిడరీలు -- జొమాటో వియత్నాం కంపెనీ, లంచ్‌టైమ్.సీజెడ్ (చెక్ రిపబ్లిక్‌లో జొమాటో స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ) లిక్విడేషన్‌ను ప్రకటించింది.
వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్: రోజుకు 2,000 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 4,128 కోట్లు.
NTPC: ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ONGC & NTPC జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేశాయి. దీంతోపాటు, విదేశీ పెట్టుబడిదార్ల నుండి 750 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6,222 కోట్లు) వరకు రుణాన్ని సేకరించాలని NTPC యోచిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ పెరుగుతున్న పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే