Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Paytm, BLS E-Services, Adani Power
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 06 February 2024: సోమవారం మధ్యాహ్నం సెషన్ నుంచి హఠాత్తుగా బలం కోల్పోయిన ఇండియన్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ, ఈ రోజు (మంగళవారం) కూడా బేరిష్‌గానే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లు కూడా బలహీన సిగ్నల్స్ పంపుతుండడమే దీనికి ఒక కారణం. కాబట్టి, ఈ రోజు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జియో ఫిన్, భారతి ఎయిర్‌టెల్ లాంటి కంపెనీలు ఆధారంగా సూచీలు కదలవచ్చు.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 23 పాయింట్లు లేదా 0.11 శాతం రెడ్ కలర్‌లో 21,813 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మూడు రోజుల ద్రవ్య విధాన సమావేశం (MPC) ఈ రోజు ప్రారంభమవుతుంది. 8వ తేదీన ఉదయం 11 సమయంలో వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడుతుంది. దేశంలో వడ్డీ రేట్లు ఈసారి కూడా మారవని మార్కెట్ భావిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
యూఎస్ మార్కెట్లు రెడ్‌లో క్లోజ్ కావడంతో, ఈ ఉదయం, ఆసియా మార్కెట్లలో నికాయ్, ASX 200, కోస్పి 0.5-0.8 శాతం వరకు పడిపోయాయి. హాంగ్ సెంగ్ 1 శాతానికి పైగా లాభంలో కదులుతోంది.
నిన్న, US మార్కెట్లలో.. S&P 500 0.32 శాతం, డౌ జోన్స్ 0.71 శాతం, నాస్‌డాక్ 0.20 శాతం పడిపోయాయి. వడ్డీ రేట్ల నిర్ణయాన్ని బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈ రోజు ప్రకటిస్తుంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: యాక్షన్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్, ఆగి గ్రీన్‌పాక్, అక్జో నోబెల్ ఇండియా, అనంత్ రాజ్, బిర్లా కార్పొరేషన్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, చంబల్ ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్, సిగ్నిటీ టెక్నాలజీస్, డాలర్ ఇండస్ట్రీస్, ఇ.ఐ.డి. ప్యారీ, EIH హోటల్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా, FIEM ఇండస్ట్రీస్, గో ఫ్యాషన్ (ఇండియా), గోద్రెజ్ ప్రాపర్టీస్, గోదావరి పవర్ & ఇస్పాత్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హాకిన్స్ కుక్కర్స్, IOL కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్, J.B. కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, JK టైర్ అండ్ ఇండస్ట్రీస్, కింగ్‌ఫా సైన్స్ అండ్ టెక్నాలజీ, లెమన్ ట్రీ హోటల్స్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నవిన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, NLC ఇండియా, FSN ఈ-కామర్స్ వెంచర్స్, ప్రోక్టర్ & గాంబుల్ హెల్త్, PNC ఇన్‌ఫ్రాటెక్, రాడికో ఖైతాన్, రెడింగ్టన్, టిమ్‌కెన్ ఇండియా, ట్రైడెంట్, TTK ప్రెస్టీజ్, టాటా టెలిసర్వీసెస్, ఉషా మార్టిన్, వక్రాంగీ, వి-మార్ట్ రిటైల్, వెల్స్పన్ కార్ప్.
BLS ఇ-సర్వీసెస్: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. IPOలో ఒక్కో షేరును కంపెనీ రూ. 135కు ఇష్యూ చేసింది.
HDFC బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో 9.5 శాతం వాటా వరకు కొనుగోలు చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించింది. అయితే, ఈ ఆమోదం హెచ్‌డీఎఫ్‌సీ AMC, జీవిత బీమా విభాగానికి మాత్రమేనని, బ్యాంక్‌కు కాదని తెలుస్తోంది.
పేటీఎం: పేటీఎం లేదా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, విదేశీ మారక ద్రవ్య నియమాలను ఉల్లంఘించినట్లు, దర్యాప్తు జరగనున్నట్లు వచ్చిన వార్తలను పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఖండించింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్: సంక్షోభంలో ఉన్న పేటీఎం వాలెట్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను జియో ఫిన్ ఖండించింది.
భారతి ఎయిర్‌టెల్: డిసెంబర్ క్వార్టర్‌లో ఏకీకృత నికర లాభం రూ.2,442.2 కోట్లకు పెరిగింది, ఇది సంవత్సరానికి (YoY) 54 శాతం జంప్. ఏకీకృత ఆదాయం 5.8 శాతం పెరిగి రూ.37,899.5 కోట్లకు చేరుకుంది.
శ్రీ సిమెంట్: టాక్స్ డిపాజిట్ కోసం ఆదాయ పన్ను విభాగం నుంచి డిమాండ్ నోటీస్ రాలేదని శ్రీ సిమెంట్ స్పష్టం చేసింది. శ్రీ సిమెంట్‌కు రూ.4,000 కోట్ల ఐటీ డిమాండ్ నోటీస్ వచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
జీ ఎంటర్‌టైన్‌మెంట్: సోనీ గ్రూప్‌తో విలీనం రద్దుకు సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ రోజు సాయంత్రం విచారిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: క్రమంగా దిగొస్తున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే