News
News
వీడియోలు ఆటలు
X

Stocks to watch 31 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఎక్స్‌-డివిడెండ్‌లో Angel One, IGL

స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌/పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stocks to watch today, 31 March 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 6 పాయింట్లు లేదా 0.03 శాతం రెడ్‌ కలర్‌లో 17,253 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌/పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

హీరో మోటోకార్ప్: నిరంజన్ గుప్తాను కంపెనీకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) హీరో మోటోకార్ప్ నియమించింది. ఇది మే 1, 2023 నుంచి అమలులోకి వస్తుందిత. ప్రస్తుతం కంపెనీ CFOగా, స్ట్రాటజీ, M&A హెడ్‌గా పని చేస్తున్న గుప్తాను CEO స్థానానికి బోర్డ్‌ ప్రమోట్ చేసింది.

విప్రో: APMEA (ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఇండియా, ఆఫ్రికా) వ్యూహాత్మక మార్కెట్ యూనిట్ కింద, భారతదేశం & ఆగ్నేయాసియా వ్యాపారాలకు బద్రి శ్రీనివాసన్ నాయకత్వ బాధ్యతలను విప్రో అందించింది.

లుపిన్: లుపిన్‌కు చెందిన పితంపూర్ యూనిట్-2 తయారీ కేంద్రాన్ని US FDA తనిఖీ చేసింది, పది పరిశీలనలను (observations) జారీ చేసింది.

అలెంబిక్ ఫార్మా: ఈ కంపెనీ కొత్త డ్రగ్ 'బ్రైమోనైడైన్‌ టార్‌ట్రేట్‌ ఆప్తాల్మిక్ సొల్యూషన్' కోసం US FDA నుంచి తుది ఆమోదం పొందింది.

BEL: దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచే ఉత్పత్తుల కోసం, భారత్ ఎలక్ట్రానిక్స్‌తో రూ. 2,696 కోట్ల విలువైన రెండు ఒప్పందాలపై రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) సంతకం చేసింది.

అరబిందో ఫార్మా: కాబోటెగ్రావిర్ టాబ్లెట్‌లు, లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్స్‌ను అభివృద్ధి చేయడం & మార్కెటింగ్ చేయడం కోసం UN సంస్థ అయిన మెడిసిన్స్ పేటెంట్ పూల్‌తో (MPP) వాలెంటరీ సబ్‌-లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని అరబిందో ఫార్మా కుదుర్చుకుంది.

క్వెస్‌ కార్ప్‌: ప్రమోటర్ ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్), క్వెస్‌ కార్ప్‌లో మరో 4.45% వాటాను కొనుగోలు చేసి, టోటల్ స్టేక్‌ పెంచుకుంది.

టాటా పవర్: మే 1 నుంచి మరో నాలుగేళ్ల పాటు కంపెనీ CEO & మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రవీర్ సిన్హాను కొనసాగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

ఏంజెల్ వన్‌: ఇవాళ ఏంజెల్ వన్ షేర్లు ఎక్స్-డివిడెండ్‌తో ట్రేడ్ అవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం ఈ కంపెనీ ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 9.6 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. షేర్‌ ధర ఈ మేరకు సర్దుబాటు అవుతుంది.

IGL: ఇంద్రప్రస్థ గ్యాస్ షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్‌ను ట్రేడ్‌తో ట్రేడ్‌ అవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఈ కంపెనీ ప్రకటించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 31 Mar 2023 07:59 AM (IST) Tags: Tata Power Hero MotoCorp Share Market Stock Market Lupin

సంబంధిత కథనాలు

FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్‌, డాలర్ల వరద పారించిన ఫారినర్లు

FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్‌, డాలర్ల వరద పారించిన ఫారినర్లు

Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్‌ - మీ అకౌంట్‌ పరిస్థితేంటో చెక్‌ చేసుకోండి

Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్‌ - మీ అకౌంట్‌ పరిస్థితేంటో చెక్‌ చేసుకోండి

Latest Gold-Silver Price Today 04 June 2023: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 04 June 2023: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Petrol-Diesel Price 04 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Petrol-Diesel Price 04 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Debit Card: ఏటీఎం కార్డ్‌తో ₹5 లక్షల 'ఫ్రీ' ఇన్సూరెన్స్‌, ఇది అందరికీ చెప్పండి

Debit Card: ఏటీఎం కార్డ్‌తో ₹5 లక్షల 'ఫ్రీ' ఇన్సూరెన్స్‌, ఇది అందరికీ చెప్పండి

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి