Stocks To Watch 30 August 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Zomato, ONGC, Maruti Suzuki
మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్-అప్‌లో ఓపెన్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 30 August 2023: NSE నిఫ్టీ నిన్న (మంగళవారం) 19,342 వద్ద క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి 23 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్ కలర్‌లో 19,535 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్-అప్‌లో ఓపెన్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
జొమాటో: ఇంటింటికి ఆహారాన్ని అందించే ఫుడ్ డెలివెరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో (Zomato)లో ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పిరియడ్ ముగియడంతో జోరుగా బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి. టైగర్ గ్లోబల్ తర్వాత, సాఫ్ట్‌బ్యాంక్ ఇవాళ బ్లాక్ డీల్స్ ద్వారా జొమాటోలో కొంత వాటాను విక్రయించే అవకాశం ఉంది. అయితే, ఈ షేర్ల బడా ఫండ్స్ చేజిక్కించుకుంటుండడంతో, జొమాటోలో అమ్మకాల ఒత్తిడి బదులు కొనుగోళ్ల పండుగ కనిపిస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: IKF హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో వ్యూహాత్మక కో-లెండింగ్ పార్ట్‌నర్‌షిప్‌ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం MSME రుణాలు, ఇంటి రుణాలను పోటీ రేట్లకే అందించగలుగుతుంది.
MPS లిమిటెడ్: ఈ కంపెనీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన MPS ఇంటరాక్టివ్ సిస్టమ్స్.. Liberate Learning Pty Ltd (ఆస్ట్రేలియా), Liberate eLearning Pty Ltd (ఆస్ట్రేలియా), App-eLearn Pty Ltd (ఆస్ట్రేలియా), Liberate Learning Limited (న్యూజిలాండ్)లో మెజారిటీ స్టేక్ కొనుగోలు చేయబోతోంది. ప్రతి ఒక్క కంపెనీలో 65% చొప్పున షేర్లను కైవసం చేసుకుంటుంది.
ONGC: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), 2038 నాటికి నెట్-జీరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునే లక్ష్యం కోసం చురుగ్గా ఉంది. ఇందుకోసం, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల మీద 2 లక్షల కోట్ల రూపాయల (24.17 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
అనుపమ్ రసాయన్: కెమికల్ మేకింగ్ కంపెనీ అనుపమ్ రసాయన్ (Anupam Rasayan), ఆస్ట్రియాకు చెందిన ESIM కెమికల్స్‌ను కొనుగోలు చేస్తోందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రతిపాదిత కొనుగోలు కోసం అనుపమ్ రసాయన్, ESIM కెమికల్స్ కలిసి ఒక ప్రత్యేక ఒప్పందంపై సంతకం చేశాయని తెలుస్తోంది.
మారుతి సుజుకి: మన దేశంలో కార్లను తయారు చేసే అతి పెద్ద కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki), ఈ దశాబ్దం చివరి నాటికి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్లాన్‌లో ఉంది. ప్రొడక్షన్ కెపాసిటీని సంవత్సరానికి నాలుగు మిలియన్ యూనిట్లకు పెంచేందుకు సుమారు రూ. 45,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని చూస్తోంది.
వాహన రంగం: ఆటో సెక్టార్ కోసం ప్రకటించిన రూ. 25,938 కోట్ల PLI స్కీమ్‌ను మరో ఏడాది పొడిగిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో, 2022-23 నుంచి 2026-27 వరకు 5 సంవత్సరాల టైమ్ పిరియడ్‌తో ఉండే పీఎల్‌ఐ స్కీమ్ గడువు 2027-28 వరకు పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: గుడ్‌న్యూస్! గ్యాస్ బండ ధర తగ్గించిన కేంద్రం - ఎంతంటే?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial