Stocks To Watch 24 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Kotak Bank, RIL, Paytm
మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 24 July 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 8.45 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 17 పాయింట్లు లేదా 0.09 శాతం రెడ్ కలర్‌లో 19,750 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: టాటా స్టీల్, TVS మోటార్, IDBI బ్యాంక్, కెనరా బ్యాంక్. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ICICI బ్యాంక్: మొదటి త్రైమాసికంలో బ్యాంక్ లాభం 40% పెరిగి రూ.9,648 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 38% పెరిగి రూ.18,227 కోట్లకు చేరుకుంది.
కోటక్ బ్యాంక్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి కోటక్ మహీంద్ర బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 67% జంప్ చేసి రూ.3,452 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 33% పెరిగి రూ.6,234 కోట్లుగా రికార్డయింది.
RIL: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 11% తగ్గి రూ.16,011 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 5.3% క్షీణించి రూ.2.11 లక్షల కోట్లకు చేరుకుంది.
పేటీఎం: Q1 FY24లో ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం ఏకీకృత నికర నష్టం రూ.357 కోట్లకు తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే బాగా మెరుగుపడింది.
RBL బ్యాంక్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో RBL బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 43% పెరిగి రూ.288 కోట్లకు చేరుకుంది.
యెస్ బ్యాంక్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక లాభంలో 10% సంవత్సరానికి (YoY) 342 కోట్ల రూపాయల వృద్ధిని యెస్ బ్యాంక్ నమోదు చేసింది.
వేదాంత: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వేదాంత ఏకీకృత నికర లాభం రూ.2,640 కోట్లుగా నమోదైంది, దాదాపు 40% తగ్గింది. కార్యకలాపాల ఆదాయం 13% తగ్గి రూ.33,342 కోట్లకు చేరుకుంది.
DLF: రియాల్టీ మేజర్ DLF కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన 12% పెరిగి రూ.527 కోట్లుగా లెక్క తేలింది. అయితే ఈ త్రైమాసికంలో ఆదాయం స్వల్పంగా 1% తగ్గి రూ.1,423 కోట్లకు పరిమితమైంది.
IGL: మొదటి త్రైమాసికంలో నికర లాభం రూ.522 కోట్లతో 8% వృద్ధిని ఇంద్రప్రస్థ గ్యాస్ సాధించింది. కార్యకలాపాల ఆదాయం 6.55% వృద్ధితో రూ. 3,761.85 కోట్లకు చేరింది.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఏప్రిల్-జూన్ కాలంలో రూ.387 కోట్ల నికర లాభాన్ని ఈ బ్యాంక్ ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,246 కోట్లుగా ప్రకటించింది.
దొడ్ల డెయిరీ: Q1 FY24లో దొడ్ల డెయిరీ నికర లాభం 40% పెరిగి రూ.35 కోట్లకు చేరుకుంది. ఆదాయం 15% పెరిగి రూ.823 కోట్లకు చేరుకుంది.
ఇది కూడా చదవండి: 5 రోజులు.. 5 ఐపీవోలు! ఈ వారం పండగే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial