Stocks To Watch 17 October 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Bajaj Finance, ICICI Pru, Delta Corp
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 17 October 2023: గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన ట్రెండ్స్, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, ఇండియన్ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సోమవారం లోయర్ సైడ్‌లో ముగిశాయి.
లాభాల్లో అమెరికా స్టాక్స్
ఎర్నింగ్స్ సీజన్ గురించి పెట్టుబడిదార్లు ఆశాజనకంగా ఉండటం, రవాణా & స్మాల్ క్యాప్ షేర్లు కూడా ఎగబాకడంతో US ప్రధాన స్టాక్ ఇండెక్స్‌లు సోమవారం బాగా పెరిగాయి.
పుంజుకున్న ఆసియా షేర్లు
కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని విస్తరించకుండా ఆపుతాయన్న ఆశలతో ఆసియా స్టాక్‌లు పెరిగాయి.
ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 4 పాయింట్లు లేదా 0.02 శాతం రెడ్ కలర్‌లో 19,808 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: బజాజ్ ఫైనాన్స్, ICICI ప్రూ లైఫ్, LTTS, హ్యాపీయెస్ట్ మైండ్స్. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ICICI సెక్యూరిటీస్: సెప్టెంబర్ త్రైమాసికంలో, వివిధ వ్యాపార విభాగాల్లో ఆదాయ వృద్ధిని ICICI సెక్యూరిటీస్ నివేదించింది. రిటైల్ ఈక్విటీస్ & అనుబంధ విభాగాల రాబడి రూ.701 కోట్లకు చేరింది. ఇది సంవత్సరానికి 39% (YoY) వృద్ధి. ఈక్విటీ ఆదాయం సంవత్సరానికి 44% పెరిగి రూ. 270 కోట్లకు చేరింది.
డెల్టా కార్ప్: విదేశీ ఇన్వెస్టర్లయిన బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) సెక్యూరిటీస్, సొసైటీ జెనరల్ సోమవారం భారీ డీల్స్ ద్వారా డెల్టా కార్ప్‌లో కొంత వాటాను ఆఫ్‌లోడ్ చేశాయి.
గ్రాసిమ్: అర్హులైన వాటాదార్లకు రైట్స్ ఇష్యూ చేసి, తద్వారా రూ.4,000 కోట్ల వరకు సమీకరించేందుకు గ్రాసిమ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
సియట్: Q2 FY24లో సియట్ నికర లాభం రూ. 208 కోట్లకు చేరింది, మల్టీఫోల్డ్ గ్రోత్ నమోదయింది. ఈ టైర్ల కంపెనీ ఆదాయం 5% పెరిగి రూ. 3,053 కోట్లుగా లెక్క తేలింది.
హడ్కో: సంజయ్ కులశ్రేష్ఠను ఐదేళ్ల కాలానికి కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బాంబే డైయింగ్: వర్లీలో భూముల విక్రయానికి సంబంధించి, ఫేజ్-1 కింద, ఈ కంపెనీ సుమారు రూ.4,675 కోట్ల ప్రతిపాదన అందుకుంది.
HDFC బ్యాంక్: 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో HDFC బ్యాంక్ ఏకీకృత నికర లాభం 51% వృద్ధితో రూ.15,976 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.78,406 కోట్లకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కొత్త ఓడరేవు కోసం ₹20 వేల కోట్ల పెట్టుబడి, అదానీ ఆలోచన తీరుకు ఇదో ఎగ్జాంపుల్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial