Stocks to watch 13 April 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - IT స్టాక్స్ మీద కన్నేయండి
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 13 April 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 15 పాయింట్లు లేదా 0.08 శాతం రెడ్ కలర్‌లో 17,864 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
TCS: 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 11,392 కోట్లకు ఏకీకృత నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 9,926 కోట్లతో పోలిస్తే ఇది 15% వృద్ధి. కార్యకలాపాల ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 17% పెరిగి రూ. 59,162 కోట్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్: ఇవాళ మార్కెట్ ముగిసిన తర్వాత తర్వాత ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు వెల్లడవుతాయి. డివిడెండ్ చెల్లింపును కూడా కంపెనీ బోర్డ్ ప్రకటించే అవకాశం ఉంది.
ఎడ్వెన్స్‌వా ఎంటర్‌ప్రైజెస్: టెక్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎడ్వెన్స్‌వా ఎంటర్‌ప్రైజెస్‌లో, ఏస్ ఇన్వెస్టర్ పొరింజు వెలియాత్ 5.69% వాటాను కొనుగోలు చేశారు. బుధవారం బ్లాక్ డీల్స్ ద్వారా ఈ లావాదేవీ జరిగింది.
డి నోరా ఇండియా: ఏస్ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్, మార్చి త్రైమాసికంలో, స్పెషాలిటీ ఎలక్ట్రోకెమికల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ డి నోరాలో 1.37% వాటా కొన్నారు.
ఆనంద్ రాఠీ: 2023 జనవరి-మార్చి కాలానికి 23% వృద్ధితో రూ. 43 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆనంద్ రాఠీ వెల్త్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 147 కోట్లుగా ఉంది, ఇది 28% వృద్ధిని సూచిస్తోంది.
బ్రిటానియా: బ్రిటానియా షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్‌తో ట్రేడ్ అవుతాయి.
వేదాంత: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) జారీ ప్రతిపాదనను పరిశీలించడానికి కంపెనీ బోర్డు నేడు సమావేశం అవుతుంది.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ నెల 19 నుంచి అమలులోకి వచ్చేలా, మరో 3 సంవత్సరాల కాలానికి సంజయ్ అగర్వాల్‌ను బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & CEOగా కొనసాగించడానికి RBI ఆమోదించింది.
NTPC: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 3,000 కోట్ల అన్‌సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను 7.35% కూపన్ రేట్‌తో 3 సంవత్సరాల కాలవ్యవధి కోసం ఈ నెల 17న జారీ చేయాలని నిర్ణయించింది.
RVNL: జైపుర్ డివిజన్‌లోని మదార్-సఖున్ సెక్షన్‌లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల కోసం నార్త్ వెస్ట్రన్ రైల్వే నుంచి లెటర్ ఆఫ్ అవార్డును (LOA) రైల్ వికాస్ నిగమ్ అందుకుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ. 63 కోట్లు.
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ మొత్తం త్రూపుట్ గతేడాది కంటే 4.71% పెరిగింది, ఇది తాత్కాలిక లెక్క.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.