Stocks Watch Today, 11 May 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ L&T, Dr Reddy's, Airtel
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stock Market Today, 11 May 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 39 పాయింట్లు లేదా 0.21 శాతం గ్రీన్ కలర్‌లో 18,397 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
డా.రెడ్డీస్ ల్యాబ్: 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ. 960.1 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నివేదించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సాధించిన రూ. 97 కోట్లతో పోలిస్తే ఇది 890% పెరుగుదల. కార్యకలాపాల ఆదాయం Q4 FY22లోని రూ. 5,068.4 కోట్లతో పోలిస్తే Q4 FY23లో రూ. 5,843 కోట్లుగా నమోదైంది.
L&T: ఇంజినీరింగ్ బెహెమోత్ లార్సెన్ & టూబ్రో, మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 10% వార్షిక (YoY) వృద్ధితో రూ. 3,987 కోట్లను ఆర్జించింది. ఏకీకృత ఆదాయం కూడా సంవత్సరానికి 10.4% పెరిగి రూ. 58,335.15 కోట్లకు చేరుకుంది.
గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ FMCG కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాదికి (YoY) 24.5% వృద్ధితో రూ. 452 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ఆదాయం దాదాపు 10% పెరిగి రూ. 3,200 కోట్లకు చేరుకుంది.
రేమండ్: విదేశీ రుణాల చెల్లింపు కోసం, రేమండ్ కన్స్యూమర్ కేర్ అసోసియేట్ కంపెనీకి ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రెండు లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రూ. 2,200 కోట్ల వరకు విలువైన NCDs జారీ చేయడానికి రేమండ్ బోర్డు ఆమోదించింది.
ఎస్కార్ట్స్ కుబోటా: మార్చి త్రైమాసికంలో ఎస్కార్ట్స్ కుబోటా నికర లాభం రూ. 191 కోట్లకు, 19% (YoY) పెరిగింది. ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17.3% పెరిగి రూ. 2,214 కోట్లకు చేరుకుంది.
సెరా శానిటరీవేర్: Q4లో, సెరా శానిటరీవేర్ ఆదాయం 21% వృద్ధితో రూ. 530 కోట్లకు చేరుకుంది, అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 439 కోట్లుగా ఉంది. అనూహ్య వ్యయం కారణంగా ఈ సంస్థ రూ. 5 కోట్ల నష్టాన్ని నివేదించింది.
వెంకీస్: వెంకీస్ (ఇండియా), 2022 మార్చి త్రైమాసికంలోని రూ. 57.4 కోట్లతో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో రూ. 25.2 కోట్ల లాభాన్ని నివేదించింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన రూ. 15.2% క్షీణించి రూ. 1,042 కోట్లకు తగ్గింది. Q4FY22లో ఇది 1,229 కోట్లుగా ఉంది.
ప్రిజం జాన్సన్: నాలుగో త్రైమాసికంలో, ప్రిజం జాన్సన్ రూ. 4.3 కోట్ల పన్ను తర్వాతి లాభాన్ని నివేదించింది, 2022 మార్చి త్రైమాసికంలోని రూ. 19.9 కోట్లతో పోలిస్తే 78% తగ్గింది. ఆదాయం సంవత్సరానికి 13.9% పెరిగి రూ. 2,112 కోట్లకు చేరింది. Q4FY22లో ఆదాయం రూ. 1,854 కోట్లుగా ఉంది.
భారతి ఎయిర్‌టెల్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ తన నెట్‌వర్క్‌లో 2 మిలియన్ల 5G యూజర్ మార్క్‌ను అధిగమించినట్లు ఈ టెలికాం కంపెనీ ప్రకటించింది.
JSW స్టీల్: JSW స్టీల్ స్వతంత్ర ముడి ఉక్కు ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 1.7 మిలియన్ టన్నులకు చేరింది, సంవత్సరానికి 7% పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలోని దీని ఉత్పత్తి 1.66 MTగా ఉంది.
ONGC: రష్యాలోని సఖాలిన్-1 నుంచి తన వాటా చమురు స్వీకరణను ఆపేసింది, బదులుగా ఆ ఫీల్డ్ నుంచి డివిడెండ్ పొందుతుంది.
థామస్ కుక్ (ఇండియా): స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ తన 41వ ప్రాపర్టీ అయిన 'స్టెర్లింగ్ లెగసీ సిమ్లా'ను ప్రముఖ హిల్ స్టేషన్ సిమ్లాలో ప్రారంభించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.