అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stocks To Watch 10 October 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Tata Steel, Maruti, Dilip Buildcon

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 10 October 2023: ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పెట్టుబడిదార్లు చాలా జాగ్రత్తగా వ్యవహిస్తున్నారు. కాబట్టి, ఇండియన్‌ ఈక్విటీస్‌ నెగెటివ్‌ బయాస్‌తో, నారో రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యే అవకాశం ఉంది.

US స్టాక్స్ అప్
ఇజ్రాయెల్-పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య యుద్ధం వార్తలను స్టాక్‌ మార్కెట్లు డైజెస్ట్‌ చేసుకోవడంతో, వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు సోమవారం లాభాల్లో ముగిశాయి.

లాభపడ్డ ఆసియా షేర్లు
ఫెడరల్ రిజర్వ్ అధికార్ల నుంచి డోవిష్‌ కామెంట్లతో ట్రెజరీలు ఎగబాకాయి, ఆసియా షేర్లు అడ్వాన్స్‌ అయ్యాయి.

ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 11 పాయింట్లు లేదా 0.06 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,611 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

టాటా స్టీల్: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్, స్టీల్ కంపెనీ టాటా స్టీల్‌ రేటింగ్‌ను స్టేబుల్‌ ఔట్‌లుక్‌తో "BB+" నుంచి "BBB-"కి అప్‌గ్రేడ్ చేసింది. UK కార్యకలాపాలను పెంచాలన్న కంపెనీ ప్రణాళిక, UK ప్రభుత్వం నుంచి కొంత ఫండింగ్‌ కారణంగా రేటింగ్ అప్‌గ్రేడ్‌ అయింది.

మారుతీ సుజుకి ఇండియా: వాహన తయారీ సంస్థ మారుతి, 2030-31 వరకు దాదాపు రూ. 1.25 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్లాన్ చేస్తోంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా, ప్రస్తుత ప్రొడక్షన్‌ లైనప్‌ను 17 మోడళ్ల నుంచి 28కి పెంచడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.

ITC: కోల్‌కతాలో తన మొదటి హోటల్‌ 'స్టోరీ' కోసం అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు ITC హోటల్స్ ప్రకటించింది. ఈ ప్రాపర్టీ మెట్రోపొలిస్‌కు సమీపంలో ఉంటుంది, 2024 ప్రారంభంలో ఓపెన్‌ అవుతుంది.

మహీంద్ర & మహీంద్ర: ఎలక్ట్రిక్‌తో సహా వివిధ ఫ్యూయల్‌ ఆప్షన్లలో మూడు చక్రాల వాహనాలు & చిన్న వాణిజ్య వాహనాలను తయారు చేసే ఈ కంపనీ విభాగం, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మొదటి విడతగా రూ. 300 కోట్లు పొందింది.

టెలికాం: AGR బకాయిల గణనలో లోపాలను సరిచేయాలన్న భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సమీక్ష పిటిషన్లను సుప్రీంకోర్టు గతంలో తిరస్కరిస్తే, ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా క్యూరేటివ్ పిటిషన్లు వేశాయి. క్యూరేటివ్‌ పిటిషన్లను “ఓపెన్ కోర్టు”లో విచారించాలని సుప్రీంకోర్టును కోరాయి. 

ఫెడరల్ బ్యాంక్: కేరళలోని అతి పెద్ద, ప్రాచీన ప్రైవేట్ రంగ బ్యాంక్‌ అయిన ఫెడరల్ బ్యాంక్, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు నిధులను 2030 నాటికి పూర్తిగా నిలిపివేస్తుందని సీనియర్ బ్యాంక్ అధికారి తెలిపారు.

జెనస్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: అధునాతన మీటరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డిజైన్ చేయడానికి, స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయడానికి ఈ కంపెనీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ మొత్తం రూ. 3,115 కోట్లతో రెండు ఆర్డర్లను గెలుచుకుంది. కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ రూ. 14,000 కోట్లుగా ఉంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన ఇన్‌ఫ్లోస్‌ను ఈ కంపెనీ ఆశిస్తోంది.

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: సెప్టెంబర్ త్రైమాసికంలో, ఈ కంపెనీ నిర్వహించిన మొత్తం కార్గో వాల్యూమ్స్‌ దాదాపు 8% (YoY) పెరిగి 1.23 మిలియన్ ట్వెంటీ ఫీట్‌ సమానమైన యూనిట్లకు చేరుకున్నాయి. ఆ త్రైమాసికంలో ఎగుమతి, దిగుమతి ట్రేడ్‌ 3.5% పెరిగింది, దేశీయ వాల్యూమ్స్‌ 26% పెరిగాయి.

దిలీప్ బిల్డ్‌కాన్: ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ ప్రాతిపదికన డ్యామ్‌లు నిర్మించడానికి రాజస్థాన్ ప్రభుత్వం నుంచి రూ.397 కోట్ల విలువైన ఆర్డర్‌ను దిలీప్ బిల్డ్‌కాన్ పొందింది. దాదాపు నాలుగేళ్ళలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది.

మజాగన్ డాక్ షిప్ బిల్డర్స్: ఆరు యూనిట్ల డెడ్ వెయిట్ టన్నేజ్ మల్టీపర్పస్ హైబ్రిడ్ పవర్ వెసెల్స్‌ను నిర్మించేందుకు ఒక యూరోపియన్ క్లయింట్‌తో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై మజాగన్ డాక్‌ సంతకం చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఇజ్రాయెల్‌తో నేరుగా కనెక్షన్‌ ఉన్న 14 ఇండియన్‌ స్టాక్స్‌, ఇవి మీ దగ్గర ఉంటే బీ కేర్‌ఫుల్‌!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget