Stocks To Watch 06 November 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Nykaa, SBI, IndiGo, Vedanta
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 06 November 2023: మార్కెట్లలో గత వారం మిక్స్‌డ్ టైమ్ నడిచింది. గత వారం తొలి అర్ధభాగంలో పడిపోయిన సూచీలు రెండో అర్ధభాగంలో నష్టాల నుంచి తేరుకున్నాయి. ఈ వారంలో, కొనసాగుతున్న త్రైమాసిక ఆదాయాలు, గ్లోబల్ ట్రెండ్స్, ఫారిన్ ఇన్‌ఫ్లోస్/ఔట్‌ఫ్లోస్ మార్కెట్‌ను నడిపిస్తాయి.
పెరిగిన US స్టాక్స్
వాల్ స్ట్రీట్ ప్రధాన స్టాక్ ఇండెక్స్‌లు శుక్రవారం ర్యాలీ చేసాయి. USలో ఉద్యోగాల వృద్ధి మందగించడం, నిరుద్యోగంలో పెరుగుదల సంకేతాలు రావడంతో బాండ్ ఈల్డ్స్ బాగా పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్, తన వడ్డీ రేటు పెంపును పూర్తి చేస్తుందన్న ఆశలను జాబ్ డేటా పెంచింది.
లాభపడిన ఆసియా షేర్లు
వడ్డీ రేట్ల సైకిల్ పీక్ స్టేజ్‌కు దగ్గరగా ఉన్నాయని మదుపరుల్లో విశ్వాసం కలగడంతో, US స్టాక్స్‌ను అనుసరించి ఆసియాలో షేర్లు ముందుకు దూసుకెళ్లాయి.
ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 24 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్ కలర్‌లో 19,451 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: దివీస్ ల్యాబ్స్, నైకా, వరుణ్ బెవరేజెస్, అదానీ ఎనర్జీ. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
వేదాంత: 2023-24 రెండో త్రైమాసికంలో, మైనింగ్ మేజర్ వేదాంత రెడ్ జోన్‌లోకి పడిపోయింది, Q2లో రూ.1,783 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని మూటగట్టుకుంది.
డెలివెరీ: సెప్టెంబర్ క్వార్టర్‌కు డెలివెరీ మెరుగైన ఫలితాలను ప్రకటించింది, ఏకీకృత నికర నష్టం ఏడాది క్రితం ఉన్న రూ.254 కోట్ల నుంచి ఇప్పుడు రూ.103 కోట్లకు తగ్గింది.
SBI: 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వతంత్ర నికర లాభం గత ఏడాది ఇదే కాలం కంటే 8% వృద్ధితో రూ.14,330 కోట్లకు చేరింది. అయితే, ఇది అంచనాల కంటే తక్కువగా ఉంది. బ్యాంక్ నికర లాభం 2022 సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.13,264.52 కోట్లుగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.16,884 కోట్లుగా నమోదైంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: 2023 జులై-సెప్టెంబర్ కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం 28% పెరిగి రూ.4,253 కోట్లకు చేరుకుంది.
ఇండిగో: విమానాల ఆపరేటర్ ఇండిగో, Q2 FY24లో రూ. 188 కోట్లు లాభపడింది, ఏడాది క్రితం ఇదే కాలంలోని రూ. 1,583 కోట్ల నష్టం నుంచి బలంగా తేరుకుంది.
PB ఫిన్‌టెక్: పాలసీబజార్‌ను నిర్వహిస్తున్న పీబీ ఫిన్‌టెక్, సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.21 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 22% పెరిగి రూ.812 కోట్లకు చేరుకుంది.
మెట్రోపొలిస్ హెల్త్‌కేర్: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, మెట్రోపొలిస్ హెల్త్ కేర్ రూ.35.45 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం 3% పెరిగి రూ.309 కోట్లుగా నమోదైంది.
ఓలెక్ట్రా గ్రీన్‌టెక్: జూలై-సెప్టెంబర్ కాలంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ రూ.18 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఆదాయం భారీగా 73% పెరిగి రూ.307 కోట్లకు చేరుకుంది.
షిప్పింగ్ కార్పొరేషన్: సెప్టెంబర్ క్వార్టర్‌లో షిప్పింగ్ కార్పొరేషన్ రూ.65.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ.114 కోట్ల ఆదాయం సంపాదించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ధన్‌తేరస్‌కు గోల్డ్ కొంటారా, బంగారం స్వచ్ఛతను ఎలా కనిపెట్టాలో మీకు తెలుసా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial