Stocks Watch Today, 03 May 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో Tata Steel, Titan
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stock Market Today, 03 May 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 80 పాయింట్లు లేదా 0.44 శాతం రెడ్ కలర్‌లో 18,141 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టైటాన్, అదానీ విల్మార్, MRF, హావెల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్. వీటిపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
టాటా స్టీల్: స్టీల్ మేజర్ టాటా స్టీల్ లిమిటెడ్, 2023 జనవరి-మార్చి కాలానికి రూ. 1,705 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ. 9,756 కోట్లతో పోలిస్తే ఇది భారీగా 82% తగ్గుదల.
అంబుజా సిమెంట్స్: మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి అంబుజా సిమెంట్స్ స్వంతంత్ర నికర లాభం స్వల్పంగా 1.6% పెరిగి రూ. 502 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 8% పెరిగి రూ. 4,256 కోట్లుగా నమోదైంది.
అదానీ టోటల్ గ్యాస్: 2022-23 నాలుగో త్రైమాసికంలో రూ. 98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది, గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 21% వృద్ధి.
కోఫోర్జ్: ప్రమోటర్ కంపెనీ బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా, కోఫోర్జ్ లిమిటెడ్‌లో 3.5% వాటాను రూ. 887 కోట్లకు ఓపెన్ మార్కెట్ ద్వారా ఆఫ్‌లోడ్ చేసింది.
ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్: ఈ కంపెనీ ప్రమోటర్లు ఇవాళ ప్రారంభమయ్యే ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా కంపెనీలో సుమారు 14.2% వాటాను విక్రయించాలని చూస్తున్నారు.
డీసీఎం శ్రీరామ్: DCM శ్రీరామ్ నాలుగో త్రైమాసికం నికర లాభం 53% క్షీణించి రూ. 187 కోట్లకు పరిమితం అయింది, ఆదాయం కూడా 3% తగ్గి రూ. 2,720 కోట్లకు చేరుకుంది.
KEI ఇండస్ట్రీస్: మార్చి త్రైమాసికంలో కేఈఐ ఇండస్ట్రీస్ రూ. 138 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఆదాయం రూ. 1,954 కోట్లుగా ఉంది.
మహీంద్ర ఫైనాన్స్: 2023 ఏప్రిల్ నెలలో, కంపెనీ మొత్తం రూ. 3,775 కోట్ల డిస్‌బర్స్‌మెంట్స్ చేసింది. 39% YoY వృద్ధిని అందుకుంది. ఆరోగ్యకరమైన డిస్‌బర్స్‌మెంట్ ట్రెండ్ కారణంగా వ్యాపార ఆస్తులు రూ. 83,900 కోట్లకు చేరాయి, మార్చి నెల కంటే ఇది 1.4% వృద్ధి.
ఫినో పేమెంట్స్ బ్యాంక్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 25% పెరిగి రూ. 22 కోట్లకు చేరుకోగా, ఆదాయం 13% వృద్ధితో రూ. 323 కోట్లకు చేరుకుంది.
గోద్రెజ్ కన్జ్యూమర్: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో NCDs జారీ ద్వారా రూ. 5,000 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదనను గోద్రేజ్ కన్స్యూమర్ బోర్డ్ పరిశీలిస్తోంది.
స్పందన స్ఫూర్తి: మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్పందన స్ఫూర్తి రూ. 105 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 349 కోట్లుగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.